Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంజిల్లాలో మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించిన మంత్రి పొంగులేటి …

భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి బుధవారం అందజేశారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో వరదల్లో మృతిచెందిన షేక్ యాకుబ్, సైదాబీ దంపతుల కుటుంబాన్ని పరామర్శించి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి కుమారులు ఎస్కె. యూసుబ్, ఎస్కె. షరీఫ్ లకు అందజేశారు. మృతుల కుటుంబం కోరిక మేరకు కూసుమంచి లో ఇంటి స్థలం కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, కూసుమంచి మండల తహసీల్దార్ సురేష్, అధికారులు తదితరులు ఉన్నారు.

భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ లతో కలిసి బుధవారం అందజేశారు. కారేపల్లి మండలం గంగారాం తండా కు మోతీలాల్, ఆయన కుమార్తె అశ్విని వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయి మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించి ఒక వ్యక్తికి ఐదు లక్షల రూపాయల చొప్పున రు. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎక్స్ గ్రేషియా తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, పత్రాన్ని అందజేశారు. అశ్విని మరణంతో దేశం, ప్రపంచం ఒక యువ శాస్త్రవేత్తను కోల్పోయిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మోతీలాల్, అశ్విని ల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

వరద బాధితులను ఆదుకోండి …సీఎం రేవంత్ కు సిపిఎం వినతి

Ram Narayana

నామ అంటే ఒక బ్రాండ్ …నామ అంటే విలులతో కూడుకున్న రాజకీయం చేసేవాడు …

Ram Narayana

సీఎం కేసీఆర్ ఖమ్మం ప్రజా ఆశ్వీరవాదసభ గేమ్ చెంజర్ …మంత్రి పువ్వాడ

Ram Narayana

Leave a Comment