తెలుగు రాష్ట్రాలు

రేవంత్ రెడ్డితో సమావేశంపై పవన్ కల్యాణ్ స్పందన!

  • ఇటీవల తెలంగాణ వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించిన పవన్
  • హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం
  • విరాళం తాలూకు చెక్ అందజేత

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ ఎంతో సుహృద్భావంగా సాగిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల, జల వనరుల సంరక్షణ పట్ల ఆయనకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని కితాబిచ్చారు. 

ప్రకృతి విపత్తు కారణంగా ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఇక్కట్ల పాలయ్యారని, ఈ నేపథ్యంలో, తన వంతు అండగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.1 కోటి విరాళం అందించానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆప్యాయంగా స్వాగతించిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

పవన్ కల్యాణ్ నన్ను కలిసి కోటి రూపాయల చెక్కును అందించారు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy thanks to Pawan Kalyan
  • పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ సీఎం
  • వరద బాధితుల సహాయార్థం విరాళం అందించారన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నానంటూ ట్వీట్

తెలంగాణ వరద బాధితులకు రూ.1 కోటి విరాళం అందించిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 

పవన్ కల్యాణ్ తనను కలిశారని, వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారని తెలిపారు. జనసేనానికి నా తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం పవన్ కల్యాణ్ రూ.6 కోట్ల విరాళం ఇచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి ఇచ్చారు. అలాగే ఏపీలో 400 గ్రామ పంచాయతీలకు… ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున ప్రకటించారు. మొత్తం ఆరు కోట్ల రూపాయలను ఆయన వరద బాధితుల సహాయార్థం అందించారు.

Related posts

దంచి కొడుతున్న వర్షాలు …పొంగిపొర్లుతున్న జలాశయాలు

Ram Narayana

గద్దర్ స్మారకంగా ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేయాలి: సీపీఐ నారాయణ

Ram Narayana

ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన సీఎం చంద్రబాబు… స్వాగతం పలికిన పార్టీ నేతలు, కార్యకర్తలు!

Ram Narayana