Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదన్న సీఎం రేవంత్ రెడ్డి!

మూసీ సుందరీకరణ… ఇప్పటికే అనేక మంది సీఎం లు చెపుతూవచ్చిన మాట …కానీ నేడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి దాన్ని చేపట్టారు … మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అక్రమకట్టడాలను తొలగించే పనిలో నిమగ్నమైయ్యారు … అనేక ఆటంకాలు అయినా లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు …సీఎం ఘటికుడే అనే మాటలు వినిపిస్తున్నాయి…కొందరు స్వచ్చందంగా ఖాళీ చేస్తుండగా మరికొందరిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు … మూసీ సుందరీకరణ చేసి తీరతామని అందుకు ఎవరు అడ్డం వచ్చిన ,ఆటంకాలు కల్పించిన ఆగే ప్రసక్తి లేదని కుండబద్దలు కొడుతున్నారు …దీంతో ఆయన పట్టుదలతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు …అదే సందర్భంలో నిర్వాసితులైన పేదలకు ప్రత్యాన్మయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇస్తున్నారు ..అందుకే సీతయ్య ఎవడు మాట వినడని జగమొండి లాగా తన తలపెట్టిన కార్యక్రమంతో ముందుకు సాగుతున్నారు …

ఈ ప్రాజెక్టును సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో మూసీ నది పరీవాహక ప్రాంతం బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను తొలగిస్తోంది. ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని, మూసీ మురికిని వదిలిస్తామని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

“ఇవాళ మూసీ నది అంటే మురికి కూపం అనే పేరు స్థిరపడిపోయింది. ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లతో ఎవరి భూములు పోలేదా? మల్లన్నసాగర్ పరిధిలో రైతులను కొట్టి, తొక్కించి, బలవంతంగా ఖాళీ చేయించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. కృష్ణా, గోదావరి, యమున, గంగ, కావేరి, సరస్వతి… ఇలా అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటామని, కానీ మూసీ నది పేరు మీద మాత్రం ఎవరూ పేరు పెట్టుకోరని వెల్లడించారు. 

పవిత్రమైన ఇతర నదుల పేర్లు పిల్లలకు పెట్టుకుంటున్నప్పుడు… ఏ తండ్రి అయినా తన బిడ్డకు మూసీ అనే పేరు పెట్టగలడా? అని ప్రశ్నించారు. ఆ మూసీ నది కంపు కొడుతోంది కాబట్టి ఎవరూ ఆ పేరు పెట్టుకోరని రేవంత్ రెడ్డి వివరించారు. 

మూసీ మురిగిపోయింది కాబట్టి, మూసీ విషంతో నిండిపోయింది కాబట్టి… ఈ పేరును పెట్టుకోవడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు అని తెలిపారు. అందుకే మూసీ నది మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

గంగా, యమున, సరస్వతి నదుల మాదిరిగా మూసీ నదిని కూడా అద్భుతంగా తీర్చిదిద్దిన… తల్లిదండ్రులు తప్పకుండా తమ బిడ్డలకు మూసీ అని పేరు పెట్టుకుంటారు అని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పేదలను రెచ్చగొడుతోంది… కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏనాడైనా పేద ప్రజల కోసం ఏమైనా చేశారా?” అని రేవంత్ రెడ్డి నిలదీశారు. అనవసర విమర్శలు పక్కనబెట్టి, మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి అని విపక్షాలకు సూచించారు.

Related posts

ఖమ్మంలో టీఆర్ యస్ నుంచి భారీ క్రాస్ ఓటింగ్ …పార్టీ లో అంతర్మధనం

Drukpadam

మహాప్రస్థానంలో ముగిసిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంత్యక్రియలు…

Drukpadam

హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికలు అక్టోబర్ 30న!

Drukpadam

Leave a Comment