Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

డిప్యూటీ సీఎం భట్టి కృషితో సోలార్ విద్యుత్తు గ్రామంగా మారనున్న సిరిపురం!

సోలార్ విద్యుత్ పనులు పూర్తయిన తర్వాత సిరిపురం గ్రామం దేశాన్ని ఆకర్షిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం రాత్రి మదిర నియోజకవర్గం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామంలో వ్యవసాయ పంపు సెట్లకు, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమైందో చూసేందుకు రావడానికి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి మంత్రులు అధికారులు గ్రామానికి క్యూ కడతారని చెప్పారు. ప్రకృతి ప్రసాదించే సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి అవసరాలకు సరిపోయే విధంగా వాడుకొని మిగిలిన విద్యుత్తును గ్రిడ్ కు అమ్మి అదనపు ఆదాయం అర్జించే విధంగా అభివృద్ధి చెందే సిరిపురం గ్రామం భవిష్యత్తులో దేశానికి మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి, మధిర నియోజకవర్గం లోని సిరిపురం గ్రామాన్ని సోలార్ విద్యుత్ గ్రామంగా మార్చడానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు, గృహ యజమానులపై రూపాయి భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి పెట్టుబడి పెట్టి వాడుకున్న విద్యుత్తు పోను మిగిలిన విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు చేసిన విద్యుత్తు కు సంబంధిత లబ్ధిదారులకు ప్రభుత్వమే డబ్బులను చెల్లిస్తుందని దీని ద్వారా రైతులకు పంటలతో పాటు సోలార్ పవర్ అమ్ముకోవడం వల్ల అదనపు ఆదాయం వచ్చే విధంగా ప్రజా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసిందని వివరించారు. మార్పు రావాలి అభివృద్ధి చెందాలన్న ప్రగతిశీల భావాలు కలిగిన రైతులు ప్రజలు నాయకులు సిరిపురం గ్రామంలో ఉన్నందునే సోలార్ విద్యుత్తు పైలెట్ ప్రాజెక్టుగా ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. గ్రామంలో సోలార్ విద్యుత్ పనులు ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేస్తామని ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యవసాయంపై ఆధారపడిన మధిర నియోజకవర్గాన్ని వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికల రూపొందించుకొని ముందుకు వెళుతున్నట్లు వివరించారు. ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మధిర ప్రజలు ఇవ్వడం వల్లనే ఇలాంటి అభివృద్ధి పనులు చేయగలుగుతున్నానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా స్వయం కృషితో రాణించేటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Related posts

అల్లు అర్జున్ వ్యవహారంపై ఎవరు మాట్లాడవద్దు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

Ram Narayana

మేడ్చల్, శామీర్‌పేటల వరకు మెట్రో రైలు పొడిగింపు…

Ram Narayana

సీఎం సహాయనిధికి కూనంనేని 2 లక్షల 50 వేల విరాళం …

Ram Narayana

Leave a Comment