Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

ఫైనాన్షియల్ సర్వీసుల కోసం కొత్త యాప్‌ను ఆవిష్కరించిన రిలయన్స్!

  • ‘జియోఫైనాన్స్’ యాప్‌ను సరికొత్తగా ప్రారంభించిన రిలయన్స్
  • హోమ్ లోన్స్ సహా అనేక ఆర్థిక సేవలను డిజిటల్‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ
  • గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్, మైజియోలో అందుబాటులో యాప్

కస్టమర్లకు ఫైనాన్షియల్ సర్వీసులను అందించేందుకు రిలయన్స్ కంపెనీ ‘జియోఫైనాన్స్’ అనే కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌ బీటా వెర్షన్‌ను మే 30, 2024న ప్రారంభించింది. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సరికొత్త మార్పులు, మరిన్ని నూతన సేవలతో పునరుద్దరించి ఈ యాప్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్, మైజియోలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలు, హోమ్ లోన్స్, ఆస్తులపై లోన్లతో పాటు పలు రకాల ఫైనాన్షియల్ ప్రొడక్టులు, సేవలను పొందవచ్చని కంపెన తెలిపింది.

ఈ యాప్ ద్వారా అందే సేవలు ఇవే..
కస్టమర్లు సేవింగ్స్‌తో పాటు రుణాలను కూడా పొందవచ్చునని రిలయన్స్ ఆర్థిక సేవల విభాగం ప్రకటించింది. సురక్షితమైన బ్యాంకింగ్ సేవల కోసం బయోమెట్రిక్‌ ప్రమాణాలతో ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్టు వివరించింది. డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో (జేపీబీఎల్)  కేవలం 5 నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్‌ను తెరవవచ్చని వివరించింది.

ఈ యాప్‌పై అదనంగా యూపీఐ చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా చెల్లించవచ్చునని కస్టమర్లకు తెలిపింది. కస్టమర్‌లు వేర్వేరు బ్యాంకులకు సంబంధించిన తమ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లను సైతం తనిఖీ చేసుకోవచ్చునని వివరించింది. ఈ యాప్‌ల లైఫ్, హెల్త్, టూ-వీలర్, మోటర్ ఇన్సూరెన్స్‌తో పాటు మొత్తం 24 బీమా ప్లాన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఈ సేవలన్నీ డిజిటల్‌గానే అందుబాటులో ఉంటాయని వివరించింది.

Related posts

ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌ను ఆశ్చర్యపరిచిన ఫ్లిప్‌కార్ట్!

Ram Narayana

పెళ్లిళ్ల సీజనా మజాకా?… భారీగా పెరిగిన బంగారం దిగుమతులు!

Ram Narayana

తన ఉద్యోగుల పట్ల జొమాటో పెద్ద మనసు…

Ram Narayana

Leave a Comment