Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రొఫెసర్ సాయిబాబాది కేంద్ర ప్రభుత్వ హత్యే …లెఫ్ట్ నేతలు!

ప్రొఫెసర్ సాయిబాబా మరణించారు. మరణం అనే మాటున చంపబడ్డాడు. రాజ్యపు పరోక్ష హత్య ఇది. ప్రజల హక్కుల కోసం నిలబడి నందుకు, వామపక్ష విప్లవ మేధావిగా ఉన్నందుకు ఆయనకు అక్రమ కేసుల్లో ఇరికించి 3588 రోజులు నాగపూర్ అండా సెల్లులో నిర్బంధించారు. 90% వికలాంగుడు గురించి కూడా మోడీ, షా ప్రభుత్వం అంత కర్కశంగా వ్యవహరించింది.
సాయిబాబా మేధావి, రచయిత, అట్టడుగు పొరల్లో నుంచి ఎదిగిన ప్రజా గొంతు.
అయన విడుదలైన కొద్దిరోజల్లోనే ఇలా మరణించడం విషాదకరం.
కామ్రేడ్ సాయిబాబా కు విప్లవ జోహార్.. ఆయన కుటుంబానికి సంతాప, సానుభూతి తెలుపుతున్నట్లు రంగారావు చెప్పారు …

ప్రొ. సాయిబాబా మృతికి సిపిఎం జిల్లా కమిటి సంతాపం

ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌, ప్రముఖ మేధావి డాక్టర్‌ జి.ఎన్‌.సాయిబాబా మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) జిల్లా కమిటి తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. 90 శాతం అంగవైకల్యం వున్నా పట్టుదలతో ఉన్నత చదువులు చదివి సమాజంలో వున్న అసమానతలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాడారని అన్నారు. దళిత, గిరిజన, ఆదివాసి, వికలాంగుల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేసి అనేక మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ..ఆలాంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా 10 ఏండ్ల పాటు నాగపూర్‌ సెంట్రల్‌ జైళ్ళో నిర్భంధించిందని గుర్తు చేశారు. జైళ్ళో కనీస సౌకర్యాలు కల్పించలేదని, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అనేక చట్టాలు చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. అంగ వైకల్యం వున్న ఒక వికలాంగుణ్ణి వేధించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసి జైలుకు పంపినా, ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ప్రజల కోసం నిలబడ్డారన్నారు. జైళ్ళో అనేకసార్లు అనారోగ్యం బారిన పడినా కనీసం వైద్య సహాయం అందించలేదని, కేంద్ర ప్రభుత్వం, జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లనే నేడు సాయిబాబా మృతి చెందారని అన్నారు. సాయిబాబా మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని స్పష్టం చేశారు. అత్యంత క్రూరంగా వ్యవహరించిన వారికి సైతం బెయిల్‌ లభించినప్పటికీ, సాయిబాబాకు బెయిల్‌ ఇవ్వకపోవడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనమని అన్నారు. మేధావులను బందీలుగా మార్చటం ప్రజా చైతన్యాన్ని అడ్డుకోవడమేనన్న వాస్తవాన్ని పాలకులు గ్రహించాలని నున్నా అన్నారు. సాయిబాబా మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు నున్నా తెలిపారు.

ప్రముఖ మేధాని, ప్రొఫెసర్ సాయిబాబా వృతిపట్ల భారత కమ్యూనిస్టు పార్టీ ఖన్యుంజిల్లా సమితి తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు . సాయిబాబా మృతి నవీన కాలపు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఈ తరం సాయిబాబా మృతితో మేధావిని కోల్పోయిందని ప్రసాద్ తెలిపాను. 90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను చూసి బలమైన ప్రజాస్వామిక దేశంగా చెప్పుకునే విజెపి నేతలు భయపడి పదేళ్లు బంధిగా ఉంచారని సుదీర్ఘకాలం జైలులో ఉంచడం కారణంగానే ఆరోగ్యల డిపోయి సాయిబాబా మృతి చెందారని ప్రసాద్ తెలిపారు. సాయిబాబా మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆయన స్పష్టం చేశాడు అత్యంత క్రూరంగా వ్యవహరించిన వారికి సైతం బెయిల్ లభించినప్పటికీ సాయిబాబాకు బెయిల్ ఇవ్వకపోవడం ప్రభుత్వ కక్ష సాదింపుకు నిదర్శనమన్నారు. సాయిబాబా బాటలో పయనించి ప్రజా చైతన్యానికి కృషి చేయగమే సాయిబాబాకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు. మేధావులను బంధీలుగా మార్చడం ప్రజా చైతన్యాన్ని అడ్డుకోవడమేనన్న వాస్తవాన్ని పాలకులు గ్రహించాలని ప్రసాద్ తెలిపారు. మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని 2014లో కేసు నమోదు చేసి తొమ్మిదేళ్ల పాటు జైలులో నిర్పింధించిన బిజెపి ప్రభుత్వం హక్కుల అణిచివేతకు పూనుకుందని ఆయన తెలిపారు. బిజెపి పాలన అంతంతోనే హక్కులకు వునిక్షేమం లభిస్తుందని ప్రసాద్ స్పష్టం చేశారు.

Related posts

తుమ్మల చొరవతో ప్రారంభానికి సిద్దమైన భద్రాద్రి రామయ్య వారధి!

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డికి కోదండరాం సహా విద్యావేత్తల బహిరంగ లేఖ!

Ram Narayana

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై ప్రశ్నించగా నాగచైతన్య సమాధానం ఇదే!

Ram Narayana

Leave a Comment