Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మంత్రి సురేఖమ్మను చుట్టుముడుతున్న వివాదాలు…

తెలంగాణాల ఫైర్ బ్రాండ్ గా పేరున్న మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు ..అసలే కొండా దంపతులు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో హడల్ … ప్రతిపక్షంలో ఉండగానే అధికార పక్షాన్ని హడల్ ఎత్తించిన సురేఖ , మురళి దంపతులు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు ..ఇక వారి కత్తికి ఎదురేముంది … వాస్తవానికి ప్రజల్లో తమ కంటూ ఒక సుస్థిర స్తానం ఏర్పరుచుకున్న కొండా దంపతులు తమను నమ్ముకున్న వారికోసం ఎంతవరకైనా పోతారనే పేరుంది …రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్న సురేఖను ఇటీవల కాలంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి…తనను ఎవరైనా అనవసరంగా కెలుక్కుంటే తాము అదే రీతిలో సమాధానం చెపుతామని ఆమె అంటుంటారు …సిద్ధిపేట జిల్లాలో ఒక అధికారిక కార్యక్రంలో పాల్గొనేందుకు ఆమె వెళ్లారు …అక్కడ బీజేపీకి చెందిన మెదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆమెకు పూలదండతో స్వాగతం పలికారు …దీనిపై మాజీమంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనుచరులుగా చెప్పబడుతున్న వాళ్ళు తప్పుడు అర్ధం వచ్చేట్లుగా కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పెట్టారు …దీంతో ఆమె హరీష్ , కేటీఆర్ లపై రెచ్చిపోయింది .. వారి పుట్టుపూర్వోత్తరాలు కడిగి పారేసింది …

ఈసందర్భంగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ సినిమా రంగానికి చెందిన అక్కినేని ఫ్యామిలీని అందులోకి లాగింది …వారి పేర్లు పెట్టి ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ పెద్దలు స్పందించారు ..మంత్రికి ఇది తగదని ఘాటుగానే బదులిచ్చారు ..దీంతో వెనక్కు తగ్గినా ఆమె తాను కావాలని అక్కినేని కుటుంబాన్ని అనలేదని అందుకు చింతిస్తున్నానని అన్నారు …అప్పటికే అక్కినేని కుటుంబానికి జరగాల్సిన డ్యామేజ్ జరిగి పోయింది …దీనిపై అక్కినేని నాగార్జున , మాజీ మంత్రి కేటీఆర్ లు కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు ..
దీనిపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుంది …

ఇది ఇలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో సరిపడటంలేదు …గతంలో ఒక సారి ఆమె ఫోన్ లోనే ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు …గీసుకొండ తన అడ్డా అని అక్కడ తన వాళ్ళను కాదని వేరే వాళ్ళను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు …తాజాగా దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయలు ప్రశ్నించారు ..ఇది మంత్రి ఎమ్మెల్యే వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది … మంత్రి వర్గీయలు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మంత్రి సురేఖ స్వయంగా గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు …వరంగల్ సీపీ అంబరీష్ జోక్యం తో ఆమె పోలీస్ స్టేషన్ నుంచి వెనుదిరిగారు … ఎమ్మెల్యే , మంత్రి మధ్య జరుగుతున్న వార్ గురించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రితోనూ ఎమ్మెల్యేతో మాట్లాడానని వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్యలు వచ్చాయని అన్ని సర్దుకుంటాయని,ఇక పంచాయతీ ముగిసినట్లేనని అన్నారు …చూద్దాం ఏమి జరుగుతుందో …!

Related posts

మా ప్రచార ‘కారు’ను తీసుకెళ్లడం అప్రజాస్వామికం: కాంగ్రెస్

Ram Narayana

రేపు జిల్లాల పర్యటనకు కేసీఆర్… ఉదయం నుంచి రాత్రి వరకు షెడ్యూల్ ఇదే

Ram Narayana

అంతవరకే నా బాధ్యత: తెలంగాణ ముఖ్యమంత్రి అంశంపై డీకే శివకుమార్ వ్యాఖ్య

Ram Narayana

Leave a Comment