నవంబర్ 13న వయనాడ్ బైపోల్.. బరిలోకి దిగుతున్న ప్రియాంకాగాంధీ
వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని జూన్‌లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి భారీ విజయంతో గెలుపొందారు. అయితే వయనాడ్ వదులుకుని రాయ్‌బరేలీలో కొనసాగుతున్నారు. దీంతో వయవాడ్ బైపోల్‌కు మంగళవారం ఈసీ షెడ్యూల్ వెల్లడించారు. నవంబర్ 13న పోలింగ్ జరగగా.. అదే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.