మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుతపులి సంచారం!…
- మెట్రో స్టేషన్ వెనుకాల భాగంలో చిరుతను గుర్తించిన స్థానికులు
- పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
- అటవీ అధికారులతో కలిసి గాలిస్తామని పోలీసుల వెల్లడి
హైద్రాబాద్ లో చిరుత సంచరిస్తున్నట్లు నిర్దారణ కావడంతో ఫారెస్ట్ అధికారులు ,పోలీస్ సిబ్బంది అప్రమత్తమైయ్యారు …గతంలో రాజేందర్ నగర్ లో సంచరించడం చాలాకాలం అది కనిపించకుండా తిరగటంతో ప్రజలు భయాందోళనలకు గురైయ్యారు …తిరిగి చాలాకాలం తర్వాత మియాపూర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని నిర్దారణ కావడంతో ప్రజలను అప్రమత్తం చేశారు …దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు …
హైదరాబాద్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నగరంలోని మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ వెనుకాల భాగంలో కొంతమంది చిరుతపులిని చూసినట్లుగా చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులతో చిరుతను గాలిస్తామని వెల్లడించారు.
మియాపూర్ స్టేషన్ వద్ద చిరుత సంచారానికి సంబంధించి ఓ వీడియో ఎక్స్ వేదికగా వైరల్‌గా మారింది. చెట్ల పక్కన నుంచి చిరుత నడుస్తూ వెళుతుండగా ఎవరో వీడియోను తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.