Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మూడు నెలలు మూసీ పక్కనే ఉంటా ..రేవంత్ సవాల్ కు సిద్ధమన్న కేటీఆర్!

  • మూసీ పక్కనే ఉండాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది బ్యూటిఫికేషన్ కాదు… లూటిఫికేషన్ అని వ్యాఖ్య
  • నాగోల్‌లో మురుగు శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేటీఆర్, హరీశ్ రావు మూడు నెలల పాటు మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండాలని, అక్కడ ఉంటే కనుక వారు చెప్పినట్లు తాను నడుచుకుంటానని సీఎం ఇటీవల అన్నారు. ఈ సవాల్‌ను కేటీఆర్ స్వీకరించారు. మూసీ పక్కన మూడు నెలలు ఉండేందుకు తాము సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది బ్యూటిఫికేషన్ కాదని… లూటిఫికేషన్ అని అన్నారు.

నాగోల్‌లోని మురుగు శుద్ధి కేంద్రాన్ని మాజీ మంత్రులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నాడు రూ.386 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం 31 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించేందుకు సిద్ధమైందన్నారు. వారసత్వ సంపదలను కాపాడుతూనే అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని పేర్కొన్నారు. రూ.545 కోట్లతో 15 బ్రిడ్జిలు నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.

మూసీ నిర్వాసితులకు ఇస్తున్న ఇళ్లు కూడా కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లే అన్నారు. మూసీ పక్కన మూడు నెలల పాటు ఉండాలని తనకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారని, ఆయన సవాల్‌కు తాను సిద్ధమే అన్నారు. దమ్ముంటే మూసీ నది లోతు పెంచి… కోల్‌కతా వంటి నగర నిర్మాణం చేయాలన్నారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు.

Related posts

నేను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు కారణం: రేవంత్ రెడ్డి

Ram Narayana

బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్..!

Ram Narayana

బీఆర్ యస్ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఫైనల్…

Ram Narayana

Leave a Comment