Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీ మార్పు వట్టి మాటలే టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌ …

పార్టీ మార్పు లేదన్న టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌
– పార్టీ మారుతున్నట్లు ఏనాడూ చెప్పలేదని వివరణ
-సోషల్ మీడియా మీద నియంత్రణ లేకుండా పోయింది
నేను ఏనాడూ పార్టీ మారాల‌ని అనుకోలేదు:
తెలంగాణ‌లోని ఉద్య‌మకారులు నాతో చ‌ర్చించారు
రాజ‌కీయ ఉద్దేశం ఏమిటి అని టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు న‌న్ను అడిగారు
అంతేగానీ, వారి పార్టీల్లో చేరాల‌న్న ప్ర‌తిపాద‌న చేయ‌లేదు
నేను కూడా ఎలాంటి ప్ర‌తిపాద‌న‌తోనూ రాజ‌కీయాలు చేయ‌లేదు

‘సామాజిక మాధ్యమాల‌పై నియంత్ర‌ణ లేకుండా పోయింది. నేను పార్టీ మారుతున్నాన‌ని, నాకు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నేను అటువంటి ప్ర‌తిపాద‌న‌లు ఎన్న‌డూ చేయ‌లేదు. ఇష్టానుసారంగా కొంద‌రు ప్ర‌చారాలు చేస్తున్నారు. అటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్దు. ఒక‌వేళ రేపు న‌న్ను ఎవరైనా వారి పార్టీలోకి ఆహ్వానిస్తే, అందులోకి వెళ్ల‌డ‌మే బాగుంటుంద‌ని నా మ‌ద్ద‌తుదారులు చెబితే దాని అనుగుణంగా నేనే ఓ నిర్ణ‌యం తీసుకుని చెబుతాను’   అని ఎల్.ర‌మ‌ణ స్ప‌ష్టం చేశారు.

తాను ఏనాడూ పార్టీ మారాల‌ని అనుకోలేదని టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ స్ప‌ష్టం చేశారు. ఎల్.ర‌మ‌ణ టీఆర్ఎస్‌లో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఆయ‌న జగిత్యాల‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ… ‘తెలంగాణ‌లోని ఉద్య‌మకారులు, మేధావులు, రాజ‌కీయ ప‌క్షాల నాయ‌కులు నాతో చ‌ర్చించారు. రాజ‌కీయ ఉద్దేశం ఏమిటి? అని, త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏంటి? అంటూ టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు న‌న్ను అడిగారు. అంతేగానీ, వారి పార్టీల్లో చేరాల‌న్న ప్ర‌తిపాద‌న చేయ‌లేదు’ అని ఎల్.ర‌మ‌ణ చెప్పారు.

‘నేను కూడా ఎలాంటి ప్ర‌తిపాద‌న‌తోనూ రాజ‌కీయాలు చేయ‌లేదు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడిగా నాకు బాధ్య‌త‌లు ఇచ్చినందుకు నేను కృత‌జ్ఞ‌త‌తో ఉంటున్నాను. ఎన్టీఆర్ సంక్షేమ కార్య‌క్ర‌మాల ప్ర‌భావ‌మే ఇప్ప‌టికీ కొన‌సాగుతూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటోంది. తెలుగు దేశం పార్టీ నుంచి ప‌దిసార్లు బీ-ఫారం తీసుకుని పోటీ చేసే అవ‌కాశం నాకు ద‌క్కింది. టీడీపీ ఆరంభం నుంచి నేటి వ‌ర‌కు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నాను’ అని ఎల్.ర‌మ‌ణ చెప్పారు.

‘ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన స‌మ‌యంలోనే టీడీపీలో చేరాను. టీడీపీ మూల సిద్ధాంతాల‌యిన బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభివృద్ధికి పాటుప‌డుతున్నాం. తెలంగాణ‌లో ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలోనూ సేవ‌లు అందించాం. రాజ‌కీయ ప‌రంగా టీడీపీ గ‌తంలోనే అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. రాజ‌కీయాల్లో రిస్క్ తీసుకోవ‌డం అనేది ఓ బాధ్య‌త. అందుకే నేను ఇటీవ‌లి ఎమ్మెల్సీ ఎన్నిక‌లోనూ పోటీ చేశాను’ అని ఎల్.ర‌మ‌ణ వ్యాఖ్యానించారు.

 

Related posts

ఇన్నాళ్లూ పవన్ ను ఎవరైనా తిరగొద్దన్నారా?: సజ్జల

Drukpadam

ఎంపీ కాకముందు నేనేంటో అందరికి బాగా తెలుసు … రైతు ఉద్యమం జస్ట్ ..రెండు నిముషాలు చాలు …కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా ….

Drukpadam

మధిర లో లింగాల కు 4 వసారి పరీక్ష కు అవకాశం ఉంటుందా …?

Drukpadam

Leave a Comment