Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం ఉద్యోగుల సమారాధన రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి … జె ఏ సి సెక్రటేరీ జనరల్… ఏలూరి…

నవంబర్ 3 వ తేదీన ఖమ్మంలో జరుపతలపెట్టిన ఉద్యోగుల వనసమారాధన రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉద్యోగసంఘాల జె ఏ సి సెక్రటరీ జనరల్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ రావు అన్నారు …ఆదివారం టి ఎన్ జి ఓస్ జిల్లా కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సకల ఉద్యోగుల సమ్మేళనం ప్రాధాన్యత వివరించారు. ఖమ్మం అంటే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని మన ప్రతిష్టను వినమడింప జేసేదిగా …ఇలాంటి కార్యక్రమం భవిష్యత్ లో జరగదేమో అన్నట్లు ,నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉండాలని అందుకు అందరం కస్టపడి పనిచేయాలని కోరారు …10 నుంచి 15 వేల మంది వరకు ఉద్యోగులు వారి కుటుంబాలు ఇందులో పాల్గొంటారని అన్నారు …అందుకు తగ్గట్లు గా ఏర్పాట్లు జరుగుతున్నాయని , వివిధ విభాగాలకు ప్రత్యేక కమిటీలు కూడా నియమించామని అన్నారు …ఈ కార్యక్రమానికి ఆదనపు ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు ,వివిధ విభాగాల్లో క్రీడలు ఉంటాయని తెలిపారు …

ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక సకల ఉద్యోగుల సమ్మేళనంలో ప్రస్తుతం జరుగుతున్న కుల, మత వనబోజనాలకు అతీతంగా కుల, మత, ఉన్నత, కింద స్థాయి ఉద్యోగులనే తారతమ్యం లేకుండా ఐక్యంగా కలిసి మెలిసి జరుపుకుంటారని తెలిపారు. వనబోజనాల కార్యక్రమంతో పాటుగా రాష్ట్ర స్థాయిలో పేరున్న కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ విభాగాల్లో పలురకాల క్రీడా పోటీలు మహిళలు, పురుషులకు విడివిడిగా నిర్వహిస్తున్నమన్నారు. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి జిల్లాల నుండి జె ఏ సి నాయకులు పాల్గొంటారని చెప్పారు. వివిధ జిల్లాలో పనిచేస్తున్నప్పటికీ పరిసర జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ నివాసాలని ఖమ్మం లో ఏర్పాటు చేసుకున్నందున కార్యక్రమానికి సుమారు
10 నుండి 15 వేల మంది హాజరావుతారని అంచనా వేస్తున్నట్టు వివరించారు.
అలాగే జె ఏ సి లో భాగస్వామ్యం కలిగిన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు, భాద్యులు ఈ కార్యక్రమానికి హాజరావుతున్నారని ఆఫీస్ సభార్దినేట్ నుండి గెజిటెడ్ ఉద్యోగాల్లో ఉన్న వారు వారి, వారి కుటుంబాలతో అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు.

దీన్ని విజయ వంతం చేసేందుకు అన్ని విభాగాలకు ఇంచార్జీలు నియమించిన్నట్టు చెప్పారు. అతిదుల స్వాగతం, పార్కింగ్, భోజనాలు, అతిధులకు వసతి, సంస్కృతిక విభాగం ఏర్పాట్లు, అతిదుల సన్మానం వంటి భోజనాల్లో శాఖహారం, నాన్ వెజ్, పూజ వంటి 20రకాల విభాగాలకు ప్రత్యేకంగా ఒక్కోదానికి నలుగురేసి ఇంచార్జీలను నియమించినట్టి అయన వివరించారు.

ఖమ్మం లో సకల ఉద్యోగుల ఆధ్వర్యంలో జరపతలపెట్టిన సకల ఉద్యోగుల సమ్మేళనం యావత్ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఏలూరి పేర్కొన్నారు. అన్ని డిపాట్టుమెంట్లు ఇందులో భాగస్వామ్యం అవుతునందున కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి ఉద్యోగులు కుటుంబాలతో పాటుగా హాజరవుతారని అన్నారు . కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018 లో ఇలాంటి కార్యక్రమం విజయవంతమైందన్నారు .. అలాంటి కార్యక్రమం ఏడే ళ్ల తర్వాత జరుగుతోందని ఉద్యోగులంతా విజయవంతం చేయాలని అత్యంత పట్టుదలతో ఉన్నారని ఇది జిల్లా ఉద్యోగుల ఐక్యతకు నిదర్శననమని చెప్పారు… ఈ కార్యక్రమంలో జె ఏ సి నాయకులు కొణిదెన శ్రీనివాస్, జమ్మి ఎస్ జయపాల్, గుంటుపల్లి శ్రీనివాస్, కాస్తాల సత్యనారాయణ, ఎం వేలాద్రి, మల్లెల రవీంద్ర, రాజేష్, కొమరగిరి దుర్గాప్రసాద్, చందాకాని రమణ యాదవ్ , శ్రీధర్ సింగ్, బుసా చంద్రశేఖర్, గంగవరపు బాలకృష్ణ, వల్లపు వెంకన్న, ఎర్రా రమేష్, పి నాగేశ్వరరావు, డాక్టర్ రత్నాకర్, దేవరకొండ సైదులు, మట్టా శ్రీను, కె కృష్ణారావు, విజయ్, శ్రీనివాసరావు, ఏలూరి కొనార్, తాళ్లూరి శ్రీకాంత్, సగ్గుర్తి ప్రకాష్, జంగం లక్ష్మణరావు, పెద్దినేని రాధాకృష్ణ, రవిచంద్ర,ఆంజనేయులు, బిక్కునాయక్, వెంటేశ్వర్లు, వేణు, లలిత కుమారి, వీణా కుమారి, సుమమాలిని, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు…

Related posts

మంత్రి తుమ్మల ముందుచూపు … ఖమ్మంకు మహర్దశ…

Ram Narayana

నన్ను సాదుకుంటారా.. సంపుకుంటారా మీఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్

Ram Narayana

పార్టీ విజయం కోసం కష్టపడిన ఏ కార్యకర్తని బిఆర్ఎస్ పార్టీ మర్చిపోదు..నామ ,వద్దిరాజు

Ram Narayana

Leave a Comment