Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఏపీ హైకోర్టు వార్తలు

నలుగురు ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు బెయిలబుల్ వారెంట్‌!

  • నలుగురు ఐఏఎస్‌ల తీరుపై హైకోర్టు అసంతృప్తి
  • కోర్టు దిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారులకు హైకోర్టు వారెంట్లు
  • నవంబర్ 27కి విచారణ వాయిదా  

కోర్టు దిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని పక్షంలో కోర్టు ముందు నేరుగా హజరై వివరణ ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించకపోవడంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాలకు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని సింగిల్ కోర్టు బెంచ్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇక వారెంట్‌ల అమలుకు వీలుగా విచారణను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.    

Related posts

జర్నలిస్ట్ హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

Ram Narayana

ఏపీ హైకోర్టు కీలక తీర్పుతో విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికపై సందిగ్దత!

Ram Narayana

హోంగార్డులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట…!

Ram Narayana

Leave a Comment