- ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన తెలంగాణ
- మూడేళ్ల పాటు ధరణి పోర్టల్ నిర్వహణకు కుదిరిన ఒప్పందం
- పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని వెల్లడి
ధరణి పోర్టల్ విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోర్టల్ నిర్వహణను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల పాటు ధరణి పోర్టల్ నిర్వహణకు ఈ ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసీతో ఒప్పందం కుదిరినట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పనితీరు బాగుంటే ఒప్పందాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తామని తెలిపింది. భూముల రికార్డ్స్ మెయింటెనెన్స్‌లో పారదర్శకత, వేగవంతం కోసం పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థకు అప్పగించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.