Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

శాంతిని నెలకొల్పడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధం…ప్రధాని మోడీ

శాంతిని నెలకొల్పడానికి, ఇతరులకు సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన మోడీ..మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‎తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. వివాదాలకు శాంతియుత పరిష్కారాలను భారత్ విశ్వసిస్తుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‎తో యుద్ధానికి శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని పుతిన్‎కు సూచించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మేము అన్ని వర్గాలతో టచ్‌లో ఉన్నాము. అన్ని వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలనేది భారత్ వైఖరి. వివాదాలకు శాంతియుత పరిష్కారాలు ఉండాలని మేము విశ్వసిస్తున్నాము. శాంతిని నెలకొల్పడానికి సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. గత మూడు నెలల్లో రష్యాలో తాను చేసిన పర్యటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచాయని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ సదస్సు కోసం కజాన్ వంటి అందమైన నగరాన్ని సందర్శించే అవకాశం నాకు లభించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. కజాన్‌లో భారత కొత్త కాన్సులేట్ ప్రారంభిస్తామని తెలిపారు.

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) రష్యాలోని కజాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి భారీగా తరలి వచ్చిన ప్రజలు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షతన 16వ బ్రిక్స్‌ సదస్సును నేడు రేపు(అక్టోబర్‌ 22, 23) నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు రష్యాలోని కజాన్‌ నగరం వేదికగా మారింది. ఈ సంద్భంగా ప్రధాని మోదీ బ్రిక్స్ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో పాటు పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు.

Related posts

ఇజ్రాయెల్ పై మెరుపు దాడికి కారణం చెప్పిన హమాస్.. అదేంటంటే..!

Ram Narayana

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు గ్రామీ పురస్కారం…

Ram Narayana

ఆకాశంలో పేలిన స్టార్‌షిప్ రాకెట్.. విమానాలు అటువైపుగా వెళ్లకుండా సూచనలు..

Ram Narayana

Leave a Comment