అంతర్జాతీయం

పైలట్లకు ఎతిహాద్ ఎయిర్ వేస్ హెచ్చరిక…

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కూలి అందులోని 241 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు చేసిన నిపుణుల కమిటీ.. ఇంధన స్విచ్ లు ఆఫ్ కావడం వల్లే విమానం కూలిపోయిందని తేల్చింది. తాజాగా ఈ నివేదిక బయటపెట్టడంతో మిగతా విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి.

దీంతో బోయింగ్‌ విమానాల్లో ఇంధన సరఫరా స్విచ్‌లపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎతిహాద్ ఎయిర్ వేస్ తన పైలట్లకు అలర్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.  బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన స్విచ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదేసమయంలో తమ సంస్థకు చెందిన అన్ని విమానాల్లో ఇంధన స్విచ్ ల పనితీరును పరిశీలించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Related posts

200 యుద్ధ విమానాలు .. 330 బాంబులు .. వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయిల్ మిలిట‌రీ

Ram Narayana

ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్న ట్రంప్ …

Ram Narayana

వైట్‌హౌస్‌కు బంగారు మెరుగులు.. సొంత ఖర్చుతో అలంకరిస్తున్న ట్రంప్!

Ram Narayana