Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

200 యుద్ధ విమానాలు .. 330 బాంబులు .. వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయిల్ మిలిట‌రీ

ఇజ్రాయిల్‌కు చెందిన 200 యుద్ధ విమానాలు శుక్ర‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన రైజింగ్ ల‌య‌న్ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నాయి. ఆ విమానాలు 100 ప్ర‌దేశాల్లో సుమారు 330 బాంబుల‌ను జార‌విడిచాయి. సుమారు వంద డ్రోన్ల‌తో ఇరాన్(Iran Drones) అటాక్ చేసిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఆ దాడుల‌ను తిప్పికొట్టేందుకు స‌న్న‌ద్దం అయిన‌ట్లు ఇజ్రాయిల్ తెలిపింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఇరాన్‌పై ఇజ్రాయిల్ ఆక‌స్మిక దాడికి పాల్ప‌డింది. అణ్వాయుధ కేంద్రాలు, అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను, సీనియ‌ర్ మిలిట‌రీ వ్య‌క్తుల‌ను ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. అయితే త‌మ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయిన‌ట్లు ఇజ్రాయిల్ వెల్ల‌డించింది. అణ్వాయుధుల‌ను ఇరాన్ డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది.

ఇజ్రాయిల్ వైమానిక ద‌ళానికి(Israel Air Force) చెందిన యుద్ధ విమానాల వీడియోను ఐడీఎఫ్ రిలీజ్ చేసింది. ఇరాన్‌పై జ‌రిగిన దాడుల్లో సుమారు 200 ఐఏఎఫ్ విమానాలు పాల్గొన్న‌ట్లు ఇజ్రాయిల్ మిలిట‌రీ చెప్పింది. ఆ ఫైట‌ర్ విమానాలు సుమారు 330 బాంబుల‌ను జార విడిచాయి. సుమారు వంద ప్ర‌దేశాల్లో వాటిని పేల్చిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఇజ్రాయిల్ విమానాల‌కు చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఇరాన్ ప్ర‌యోగించిన డ్రోన్లు ఇజ్రాయిల్‌కు చేరుకునేందుకు కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ది.

Related posts

“మస్క్ డ్రగ్స్ తీసుకున్నారా ? ” అనే ప్రశ్నకు ట్రంప్ స్పందన

Ram Narayana

అమెరికాలో షాకింగ్ ఘ‌ట‌న… భార‌తీయ యువ‌తి కాల్చివేత‌!

Ram Narayana

ప్ర‌పంచంలోని అతిపెద్ద‌ క్రిమిన‌ల్‌ను మోదీ ఆలింగనం చేసుకోవ‌డం చాలా నిరాశను కలిగించింది: ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

Ram Narayana

Leave a Comment