Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మహాత్మా గాంధీ అతి పెద్ద విగ్రహం హైద్రాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ..గున్న రాజేందర్ రెడ్డి హర్షం ..

ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహం హైద్రాబాద్ బాపు ఘాటులో లో ఏర్పాటు చేయాలనీ రేవంత్ సర్కార్ నిర్ణయించడంపట్ల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు …ఆదివారం ఆయన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇది ఒక బృహత్తర నిర్ణయమని శాంతి ,అహింస ,అనే ఆయుధాలుగా దేశ స్వాతంత్య్రానికి గాంధీ చేసిన అవిశ్రాంత పోరాటం ఫలితంగానే బ్రిటిష్ వాణ్ణి మనదేశం నుంచి తరిమి కొట్టగలిగామని అన్నారు …గాంధీ మార్గం ఆచరణీయం ప్రపంచ శాంతికి ఇది అత్యంత అవసరం ఆచరణీయం …దాన్ని కొనసాగించాలని అందుకు ఆమహనీయుణ్ణి మనం గుర్తుంచుకునేలా , కొత్తతరానికి పరిచయం చేసే విధంగా గాంధీని గుర్తు చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు …

ఆదివారం కుంట్లూరు లోని గాందేయన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో జరిగిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కమిటీ జరిగింది .. సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో మహాత్మా గాంధీ విజ్ఞాన మైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సుస్థిర విద్య ,వైద్యం, సేంద్రియ వ్యవసాయం, ఇంధన వనరులు, గ్రామీణ పరిశ్రమలు ,పర్యావరణం మరియు సత్యం, అహింసలపై గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు విద్యాసంస్థలలో మరియు అన్ని రంగాలలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆచరించే విధంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాయని అన్నారు …అందుకు గాంధీ సంస్థలు కృషి చేశాయని , చేస్తున్నమని అన్నారు . చారిత్రాత్మకమైన అతిపెద్ద విశ్వ గాంధీ విగ్రహ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ధన్యవాద తీర్మానం పేరుతో ఈ నెల 29 మంగళవారం ఉదయం 11 గంటలకు తెలంగాణలోని 33 జిల్లా కేంద్రాలలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేయాలని జిల్లా కమిటీలకు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమము ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అందర్నీ భాగస్వాములు చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి ,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెరుగు మధు, ప్రతినిధులు పొట్లపల్లి గిరిధర్, గూడూరు మదన్మోహన్, సంజయ్ రెడ్డి, రాంబాబు, పడమటి పావని ,మదన్, వై చైతన్య రెడ్డి , రామకృష్ణారెడ్డి ,సతీష్ ,సాయి ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు

Related posts

స్వరాష్ట్రం కోసం పోరాడం, దెబ్బలు తిన్నాం, జైళ్ళకెళ్ళాం మమ్మలను ఆదుకోండి…తెలంగాణ ఉద్యమకారులు …

Ram Narayana

అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్!: కేంద్రమంత్రి పదవిపై కిషన్ రెడ్డి వ్యాఖ్య…

Drukpadam

ప్రజలపక్షాన ప్రభుత్వంపై పోరాడతానన్న కాంగ్రెస్ నేత మధు యాష్కీ!

Ram Narayana

Leave a Comment