Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

డి.ఎ ప్రకటించినందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉద్యోగుల కృతజ్ఞతలు…

క్లిష్టసమయంలో సైతం ఉద్యోగులపై మమకారంతో డి ఏ ప్రకటించినందుకు గాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కు ఉద్యోగ సంఘాల నేతలు కృతఙ్ఞతలు తెలిపారు. ఆదివారం ఖమ్మం పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సత్కరించారు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకున్నా ఉద్యోగుల గురించి ఆలోచించిన ప్రభుత్వం నిజంగా ఉద్యోగ పక్షపాతీ అని అన్నారు. ఆర్ధిక మంత్రిగా ఉద్యోగుల బాగోగులు అలోచించి డి ఏ ప్రకటించడం ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నది సాహసొపేపేత నిర్ణయమని నేతలు పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర జె ఏ సి అధ్యక్షులు మారం జగదీశ్వర్ సైతం హర్షం వ్యక్తం చేశారాన్నారు.

అలాగే నవంబర్ 3వ తేదీన ఖమ్మం లో జరిగే సకల ఉద్యోగుల సమ్మేళనం, వనసమారాధన కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ దేవరకొండ సైదులు, టి జి ఓ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీ ఎన్ జి ఓ నాయకులు గుంటుపల్లి శ్రీనివాస్, జడ్ ఎస్ జయపాల్ విజయకుమార్, గంగవరపు బాలకృష్ణ, కొమరగిరి దుర్గాప్రసాద్, తాల్లూరి శ్రీకాంత్, ఎర్రా రమేష్, ఆంజనేయులు, పెద్దినేని రాధాకృష్ణ, సగ్గుర్తి ప్రకాశరావు, రుక్మారావు, శంకర్, అస్లాం, మట్టా శ్రీను, తదితరులు పాల్గొన్నారు…

రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఉద్యోగి యోగక్షేమాలు చూడటం మా ప్రభుత్వ భాద్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ మా కుటుంబ సభ్యులని అన్నారు. కేవలం డి ఏ లే కాకుండా ప్రతీ సమస్యను పరిష్కరిస్తామన్నారు‌.

Related posts

ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర.. ఇంతింతై వటుడింతై అన్నట్టు పరిస్థితి ఉంది: కేసీఆర్

Ram Narayana

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో రూ.21 కోట్లకు పైగా టోకరా…

Ram Narayana

జర్నలిస్టుల సంక్షేమం పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ఢిల్లీ జర్నలిస్టుల కృతజ్ఞతలు!

Ram Narayana

Leave a Comment