Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

హాట్టహాసంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలకు సిద్ధం

హాట్టహాసంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలకు సిద్ధం

  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు పిలుపు
  • సర్వం సిద్ధం చేసిన శీనన్న అభిమానులు
  • రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలతో హెూరెత్తించేందుకు రెడీ
    -కరచాలనం ముద్దు… బొకేలు… శాలువాలు వద్దుని అభిమానులకు విజ్ఞప్తి
  • నేరుగా వచ్చి పుట్టిన శుభాకాంక్షలు తెలిపే వారికి మంత్రి పొంగులేటి సూచన
  • సమాజ, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు
  • వేడుకల వివరాలను వెల్లడించిన తుంబూరు దయాకర్ రెడ్డి

రాష్ట్ర రెవెన్యూ ,గృహనిర్మాణ , సమాచారశాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా హాట్టహాసంగా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమైయ్యారు….గతంలో ఎన్నడూ లేని విధంగా కేక్ కట్టింగ్ లు , అన్నదానాలు , రక్తదాన శిభిరాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి , ఆటల పోటీలు ఒకటేమిటి బహుముఖ కార్యక్రమాలు జరపనున్నారు .. కార్యక్రమాల నిర్వహణకోసం ఎక్కడిక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి… కాంగ్రెస్ నేతలు, పొంగులేటి అభిమానులు సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలతో ఉమ్మడి జిల్లాను హెరెత్తించేందుకు రెడీ అయ్యారు. భారీ కటౌట్లు, ప్లెక్సీలు, హెూర్డింగ్లను పురవీధుల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. కాగా ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి వెల్లడించారు.

ఉదయం 09.00గంటలకు ఖమ్మం క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై ఖమ్మం ప్రధాన ప్రభుత్వాస్పత్రి వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఉ ంటుందన్నారు. ఉదయం 10.30గంటలకు దానవాయిగూడెం, రామన్నపేట కాలనీల్లో రక్తదాన శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. 11.00గంటలకు ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్రోడ్ లో రక్తదాన శిబిరం, 11.30గంటలకు కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరం, మధ్యాహ్నం 12.30గంటలకు ఖమ్మంలోని జీవనసంధ్యా వృద్ధాశ్రమం, అన్నం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమాలు ఉ ంటాయన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శీనన్న జన్మదిన వేడుకల సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. రాత్రి 08.00గంటలకు ముదిగొండ వెంకటాపురంలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఇవేకాక ఇంకా అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కావున ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని పొంగులేటి శీనన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలం దరూ ఆయా ప్రాంతాల్లో జరిగే వేడుకలు, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులవ్వాలని దయాకర్ రెడ్డి కోరారు.

బొకేలు… శాలువాలు వద్దని… కరచాలనమే ముద్దని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పుట్టినరోజు సందర్భంగా సోమవారం (రేపు) తనను నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చే మిత్రులు… శ్రేయోభిలాషులు… అభిమానులు… నాయకులు…. కార్యకర్తలందరూ అవేమి లేకుండానే రావాలని సూచించారు. బొకేలు… శాలువాలు.. మెమోంటోలు… కేక్ లకు అయ్యే ఖర్చులను సమాజ, సామాజిక కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. అనవసరమైన ఖర్చులను తగ్గించాలన్నారు. ఆయా ప్రాంతాల్లోనూ హంగు ఆర్భాట కార్యక్రమాలను తగ్గించుకుని, పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, పేద ప్రజలకు వస్త్రాల పంపిణీ, మెడికల్ క్యాంపు, రక్తదాన, అన్నదాన కార్యక్రమాలంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రతి ఒక్క తన అభిమాని దీనిని గమనించాలని కోరారు.

Related posts

సమాజ అభివృద్ధికి జర్నలిస్టుల కృషి ఎనలేనిది..ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్

Ram Narayana

డీప్‌ఫేక్‌ ఆడియోల ద్వారా తనపై అసత్య ప్రచారం… మండిపడ్డ మాజీమంత్రి అజయ్

Ram Narayana

ఖమ్మం మార్కెట్లోకి ఒకే రోజు బజాజ్ సిఎన్జి బైకులు, మహేంద్ర తార్ రాక్స్ వాహనాలు విడుదల! .

Ram Narayana

Leave a Comment