Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

డాక్టర్‌ను పెళ్లాడేందుకు రూ. 50 కోట్ల కట్నం డిమాండ్ చేసిన ఎయిమ్స్ టాపర్!

  • ‘ఎక్స్‌’లో విషయం పంచుకున్న యూజర్
  • తన స్నేహితురాలు కూడా వైద్యురాలేనని, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనెస్థీషియాలో స్పెషలైజేషన్ చేస్తోందని వివరణ
  • పెళ్లికి రూ. 50 కోట్లు డిమాండ్ చేసినప్పటి నుంచి ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోందని ఆవేదన
  • డాక్టర్ అయి ఉండీ సొంత కాళ్ల మీద నిలబడలేని చదువు ఎందుకని ప్రశ్న
  • సమాజంలో కట్నం సామాజిక రుగ్మత అయిపోయిందని ఆవేదన

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) టాపర్ ఒకరు డాక్టర్ అయిన తన స్నేహితురాలిని పెళ్లి చేసుకునేందుకు రూ. 50 కోట్ల కట్నం డిమాండ్ చేసినట్టు బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆరోపిస్తూ ఎక్స్‌లో ఈ విషయాన్ని పంచుకుంది. కట్నం డిమాండ్ చేసినప్పటి నుంచి ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజుల్లో కూడా కట్నం ఎంత మూమూలు విషయంగా ప్రబలిపోయిందో ఈ ఘటన మనకు చెబుతోందని ఆమె విచారం వ్యక్తం చేశారు. తన స్నేహితురాలిని కట్నం అడిగిన ఆ వ్యక్తి ఎయిమ్స్ ఎంట్రన్స్‌ (మాస్టర్ ఆఫ్ చిరుర్గియే ఇన్ యూరాలజీ)లో టాపర్ అని తెలిపింది. 

తన స్నేహితురాలు కూడా డాక్టరేనని, హైదరాబాద్‌లో అనెస్థీషియాలో ఎండీతోపాటు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనెస్థీషియాలో స్పెషలైజేషన్ చేస్తోందని ఆమె వివరించింది. ఎయిమ్స్ ఫస్ట్ ర్యాంకర్.. డాక్టర్ అయిన తన స్నేహితురాలిని రూ. 50 కోట్ల కట్నం అడిగినట్టు చెబుతూ ‘కొంచెమైనా సిగ్గుందా?’ అని ప్రశ్నించారు. డాక్టర్ అయి ఉండీ సొంత కాళ్లపై నిలబడే దమ్ములేని చదువు ఎందుకని దుమ్మెత్తి పోశారు. 

రూ. 50 కోట్లంటే ఆమె తల్లిదండ్రుల జీవితకాల సంపాదన అని, ఆ డిమాండ్ వచ్చినప్పటి నుంచి తను విలపిస్తోందని చెప్పారు. తెలుగు అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే పెద్ద మొత్తంలో కట్నం చెల్లించుకోక తప్పదని ఆమె తల్లిదండ్రులు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. ఆమెకు ఓ చెల్లెలు ఉందని, తన స్నేహితురాలికి ఆ మొత్తం కట్నంగా ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆమె కూడా అంతే ఇచ్చుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆమె పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అలాంటి వ్యక్తుల లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts

వజ్రాల నెక్లెస్‌ను పొరపాటున చెత్తలో విసిరేసిన ఓనర్.. వెతికి తీసిన మున్సిపల్ సిబ్బంది!

Ram Narayana

స్నేహితుడి భార్యతో మస్క్ ఎఫైర్? కూలిన కాపురం

Ram Narayana

హైదరాబాద్‌లో వాలిన ‘ఆకాశ తిమింగలం’.. !

Ram Narayana

Leave a Comment