Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఐపీఎల్ క్రికెట్

ఐపీఎల్ 2025 మెగా వేలం.. ఈ ఐదుగురు ఆటగాళ్ల రిటెన్ష‌న్‌ రూ. 20 కోట్లు ప‌లికే అవ‌కాశం!

  • రేప‌టితో ముగుస్తున్న ఆట‌గాళ్ల రిటెన్ష‌న్ గడువు
  • త‌మ రిటైన్‌, విడుద‌ల చేసే ఆట‌గాళ్ల జాబితాతో రెడీగా ఉన్న 10 జ‌ట్లు
  • కోహ్లీ, రోహిత్‌, పంత్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ రిటైన్‌కు రూ.20కోట్లు చెల్లించే అవ‌కాశం

రేప‌టితో రిటైన్ చేసుకునే ఆట‌గాళ్ల జాబితాను వెల్ల‌డించేందుకు గ‌డువు ముగియ‌నుంది. దాంతో ప‌ది ఐపీఎల్‌ జట్లు తమ రిటైన్, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక‌ ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఇటీవ‌ల బీసీసీఐ అనుమతించిన విష‌యం తెలిసిందే. ఆరుగురిలో కనీసం ఒకరు అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ అయి ఉండాలి. 

కాగా, కేఎల్‌ రాహుల్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి చాలా మంది ప్రముఖ ఆట‌గాళ్లు ఈసారి మెగా వేలంలో వ‌చ్చే అవకాశం ఉంద‌ని గ‌త కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదిలాఉంటే.. ప్ర‌స్తుతం ఉన్న టాప్ ప్లేయ‌ర్ల‌లో రూ. 20కోట్ల‌కు రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉన్న ఐదుగురు ఆట‌గాళ్ల‌ను ఇప్పుడు మ‌నం చూద్దాం.

1. విరాట్ కోహ్లీ
భారత మాజీ కెప్టెన్ 2008లో ప్రారంభ సీజన్ నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి ఆడుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌ కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు ఒకే ఫ్రాంచైజీ ఆడుతున్న ప్లేయ‌ర్‌గా విరాట్‌ ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక ర‌న్‌ స్కోరర్ అయిన కోహ్లీకి ఈసారి ఆర్‌సీబీ రూ.20 కోట్లకు రిటైన్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఇక ర‌న్‌మెషిన్‌ను 2018లో బెంగ‌ళూరు రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకున్న విష‌యం తెలిసిందే.

2. రిషబ్ పంత్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇటీవల సోషల్ మీడియా వేదిక‌గా చేసిన ఒక‌ పోస్ట్ బాగా వైర‌ల్ అయింది. ఒక‌వేళ తాను ఐపీఎల్‌ వేలంలోకి వస్తే త‌న‌కు ఎంత ధ‌ర ప‌ల‌కొచ్చు అని అభిమానుల‌ను సర‌దాగా అడిగాడు పంత్. దాంతో ఫ్యాన్స్ ఢిల్లీని వ‌దిలిపెట్టే అవ‌కాశం ఉందంటూ ఊహించుకుంటున్నారు. కాగా, పంత్ 2016లో తన తొలి సీజన్ నుండి డీసీ (గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్)లో కొన‌సాగుతున్నాడు. ఈసారి అత‌ని రిటెన్ష‌న్ కోసం ఢిల్లీ రికార్డు స్థాయిలో రూ.20 కోట్లు వెచ్చించే అవ‌కాశం ఉంది.

3. శ్రేయాస్ అయ్యర్
ఈ టీమిండియా స్టార్‌ ఆట‌గాడు ఈ ఏడాది ప్రారంభంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన విష‌యం తెలిసిందే. అయితే, గత ఐపీఎల్ సీజ‌న్‌లో కేకేఆర్‌ను విజేతగా నిల‌ప‌డంలో కెప్టెన్‌గా శ్రేయర్ అయ్యర్ సక్సెస్ అయ్యాడు. దీంతో టైటిల్ కోసం ఫ్రాంచైజీ ప‌దేళ్ల‌ నిరీక్షణకు తెర‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో అయ్యర్‌ను ఆ జ‌ట్టు విడిచిపెట్టే అవ‌కాశం లేదు. ఇప్ప‌టికే కొత్త కెప్టెన్ కోసం అనేక జట్లు వెతుకుతున్నందున, అయ్యర్‌ను అంటిపెట్టుకోవడానికి కోల్‌క‌తా రూ. 20 కోట్లు ఆఫర్ చేయవచ్చు.

4. హార్దిక్ పాండ్యా
మెగా ట్రేడ్ డీల్‌లో భాగంగా గత సీజన్‌లో హార్దిక్‌ను ముంబ‌యి ఇండియ‌న్స్ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. దీంతో మెగా వేలానికి ముందే తమ కెప్టెన్ హార్దిక్‌ను తన వద్దే ఉంచుకునే అవకాశం ఉంది. ఈ క్ర‌మంలో అత‌నికి రూ. 20 కోట్ల వ‌ర‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

5. రోహిత్ శర్మ
ఐపీఎల్‌ 2025 వేలానికి ముందు రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. భార‌త కెప్టెన్‌గా ఎంతో అనుభ‌వం ఉన్న హిట్‌మ్యాన్ ఈసారి ఎంఐని వ‌దిలిపెట్టే అవ‌కాశం ఉంద‌ని అనేక మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. అయితే, గత సీజన్‌కు ముందు రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించినప్పటికీ, ఫ్రాంచైజీ అతనిని కొనసాగించడానికి సుముఖంగా ఉన్న‌ట్లు తాజా నివేదిక పేర్కొంది. హిట్‌మ్యాన్ వేలానికి వెళ్ల‌కుండా రూ. 20 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేసే అవ‌కాశం ఉంది. 

Related posts

ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా వచ్చేసింది… రోహిత్ సంగతి ఏంటంటే!

Ram Narayana

టీ20ల నుంచి వైదొలిగిన‌ నాకు ఈ ధ‌ర‌ సరైనదే.. రిటెన్షన్ వాల్యూపై రోహిత్ శ‌ర్మ‌!

Ram Narayana

ఐపీఎల్ రిటెన్షన్… అన్ని జట్ల రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా ఇదే!

Ram Narayana

Leave a Comment