హోమ్ మంత్రి అనితపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు …భగ్గుమన్న మంద కృష్ణమాదిగ
బాధ్యతగల పదవులు ఉన్న పవన్ కళ్యాణ్ మాటలు హోమ్ మంత్రిని కించపరిచేయిలా ఉన్నాయి ..
పవన్ కళ్యాణ్ మంత్రిగా పనికిరాడంటే ఎలా ఉంటుందని ప్రశ్న
ఆయన కాపులకు పెద్ద కావచ్చుకాని మాకు కాదన్నా మంద కృష్ణ
ఇది కేవలం మంత్రిని అన్నట్లుకాదు సీఎంను మొత్తం ప్రభుత్వాన్ని అన్నట్లుగా భావించాలని వ్యాఖ్య
ప్రభుత్వంలో భాగమై ఉండి బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఏమిటి …?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనితపై సీరియస్ కామెంట్స్ చేశారు …పోలీస్ శాఖను తిట్టిపోశారు ..పోలీసులు పనిచేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు …హోమ్ మంత్రి పదవికి పనికి రారని అవసరమైతే తానే ఆశాఖను తీసుకుంటానని ప్రకటించుకున్నారు …ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వం పెద్దన్న టీడీపీ ,జనసేన , బీజేపీ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి …అందులో పవన్ కళ్యాణ్ కీలకమైన ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు …తనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటె సీఎంతో కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంది…ఒక వేళ మంత్రివర్గంలో మార్పులు జరగాలంటే అది పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయాధికారమే …అలాంటిది కీలకమైన హోమ్ శాఖను నిర్వహిస్తున్న ఒక దళిత మహిళపై ఆయన మాట్లాడటం అదికూడా సీఎం కు ఏమాత్రం చెప్పకుండా బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది …
దీనిపై ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పందించారు …స్వయంగా చంద్రబాబును కలిశారు ..పవన్ వాక్యాలు పై మండిపడ్డారు …మాదిగ జాతికి చెందిన మహిళపై పవన్ మాటలు కించపరిచేలా ఉన్నాయని అన్నారు …ఆయన మంత్రి పదవి పనికి వస్తారా అనే ఎలా ఉంటుందని అన్నారు …సీఎం మంత్రులు , మంత్రివర్గంలో చేర్చించాల్సిన విషయాలను తన సొంతం అన్నట్లుగా మాట్లాడటం తగదని హితవు పలికారు …ఆయన కాపులకు పెద్ద కావచ్చునేమో కానీ మాకు కాదని గుర్తు పెట్టుకోవాలని ఘాటుగా స్పందించారు …