Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీలో ప్రజాస్వామ్యం ఖుని… పోలీసులు ఖబర్దార్ మాజీ సీఎం జగన్ వార్నింగ్..!

రాష్ట్రంలో చీకటి రోజులు …ప్రశ్నించే స్వరం ఉండకూడని … ప్రజాస్వామ్యాన్ని ఖుని చేశారు .. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ ,సెవన్ అన్నారు …ఏవి లేవు …ప్రతి సెక్షన్ ను మోసం చేశారు ….15 వేలు అంటూ అందరిని మోసం చేశారు … అన్ని వ్యవస్థలను నీరు గార్చి నాశనం చేశారు ..పిల్లల ఫీజు రియంబర్స్ మెంట్ అందక …ప్రతి మూడు నెలలకు ఇవ్వాలి …జనవరి ,ఫిబ్రవరి రెండు క్వాటర్స్ ఎగొట్టారు …పిల్లలపై యాజమాన్యాలు వత్తిడి పెడుతున్నాయి…వసతి దీవెన కింద 20 వేలు ఇచ్చే వాళ్ళం ….విద్యావ్యవస్థ రోడ్ మీదకు ఎక్కింది …సీబీఎస్ ఇ మూసేందుకు సిద్ధంగా ఉంది …విద్య ,వైద్యం నిర్వీర్యం అయింది …బకాయిలు ఇవ్వడంలేదు …ఆరోగ్య ఆసరా ఊసేలేదు …ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరి పోయింది …జీరో వేకెన్సీ తో ఉండాలంటే అది లేదు ..

రైతులకు ఇ crop లేదు …ఉచిత ఇన్సూరెన్స్ లేదు …ప్రతిపథకం డోర్ డెలివరీ ఊసేలేదు …లక్షన్నర పెన్షన్లు లేవు …కొత్త పెన్షన్లు నమోదు జరగటంలేదు …

5 నెలల కాలంలో 91 మీద అత్యచారాలు ..ఐదుగురు పిల్లలు చనిపోయారు …టీడీపీ కార్యకర్తల దాడులు అధికమైయ్యాయి…తెనాలిలో సహన అనే అమ్మాయి చంపారు …బద్వేల్ పట్టణంలో జరిగిన ఘటన అత్యంత ఘోరం. బర్తడే అంటూ పిలిచి ఆ అమ్మాయిపై అఘాయిత్యాలు …హిందూపురం లో జరిగిన ఘటనపై చంద్రబాబు భావమర్ది మాట్లాడలేదు …

డిప్యూటీ సీఎం నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ కౌన్సిలర్ భర్త దళిత మహిళాను డంప్ యార్డ్ లో రేప్ చేస్తే, చెత్తగాకితాలు అమ్ముకునే వాళ్ళు ఆ అమ్మాయిని కాపాడారు …తిరుపతిలో ఎర్రావారి పాలెంలో 10 క్లాస్ పాపను బలవంతంగా కిడ్నప్ చేసుకొని పోయి ..కట్టి తాగిపిచ్చి అత్యాచారం జరిపారు ..

కాకినాడ రూరల్ కు చెందిన జనసేన ఎమ్మెల్యే ఫీల్డ్ అసిస్టెంట్ ని పక్కలోకి వస్తావా అని అడిగిన విషయం వైరల్ అయింది ..ఇన్ని జరుగుతున్నా ఏమి చేస్తున్నారు …ప్రశ్నిస్తే కేసులు అరెస్టులు ,ఏకంగా ఇల్లీగల్ డిటెన్షన్ ఏమిటి దారుణం …

విజయవాడ వరదలపై సీఎం ను ప్రశ్నిస్తే కేసులు …ఫుడ్ మీద 534 కోట్ల రూపాయలు …కరెంటు కు 23 కోట్లు … దుబారా జరిగిందంటే వేధింపులు ,కేసులు ,అరెస్టులు …ఇదేమి ప్రజాస్వామ్యం …

స్కాములకోసం అమ్మేస్తున్నారు …మూడు పోర్టులు అవి పూర్తీ అయితే కదా …? సంపద సృష్టించేది ..మరి ఎందుకు అమ్ముతున్నారు …అంటే ఇల్లీగల్ డిటెన్షన్ …

తిరుపతి లడ్డు మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో పెడితే కేసులు ..అరెస్టులు … ఇవన్నీ దాదాపు విచ్చలవిడిగా జరుగుతున్నాయి….ఇప్పటికి 101 మందిని అరెస్ట్ చేశారు …7 సంవత్సరాలకు తక్కువ శిక్షపడే కేసులకు వెంటనే అరెస్టులు ఉండవు …41 నోటీసు సర్వ్ చేసి విచారించాలి ….కానీ ఏమి జరుగుతుంది …సుప్రీం కోర్ట్ తీర్పులకు విరుద్ధంగా చేస్తున్నారు … అరెస్ట్ చేసే అధికారం లేకున్నా అరెస్టులు …స్వతంత్రంగా గొంతు విప్పితే రాత్రికి రాత్రి లేదా తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంటున్నారు …పోలీస్ స్టేషన్లో కొడుతున్నారు …తిడుతున్నారు ..అవమానిస్తున్నారు …పోలీసులు తీరు పట్ల ఎవరైనా తిరగబడితే మళ్ళీ కేసులు …కుటుంబసభ్యులను పోలీస్ స్టేషన్ కు తీసుకోని పోయి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ….

సీఎం ,సీఎం కొడుకు ,డిప్యూటీ సీఎం కూడా డీజీపీ పై వత్తిడి తెస్తున్నారు …ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారు …

అమ్మను చంపడానికి జగన్ అని రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదాన్ని టీడీపీ ఆఫీసియల్ సైట్ లో పెట్టి సిగ్గులేకుండా వైరల్ చేస్తున్నారు …దానిపై విజయమ్మ ఏమి చెప్పింది …అది కూడా ఫేక్ అంటున్నారు ..

అయ్యా డీజీపీ గారు …పోలీసులు శాల్వుట్ కొట్టాల్సింది మీ చొక్కా మీద ఉన్న మూడు సింహాలకు కానీ అన్యాయాలకు అక్రమాలకు కాదు …మీరు ఇల్లీగల్ అరెస్టులు చేస్తున్నారు …చంద్రబాబు ఆదేశాల మేరకు మీరు చేసిన అకృత్యాలు … పై కేసులు పెడతాం కోర్టులోనే తేల్చుకుంటాం….వైయర్సీపి భాదితులకు లీగల్ ఎయిడ్ ఇస్తుందని జగన్ అన్నారు …

సరస్వతి సిమెంట్ భూములపై …

వాటిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణ జరపన్నారు …అవి పక్క ప్రవేట్ భూములు …రైతుల దగ్గర వారు ఎకరాకు 2 లక్షల 70 అడిగితె 3 లక్షలు ఇచ్చి తీసుకోమని అన్నాం…అక్కడ ఎమ్మార్ ఓ కూడా ఆ భూములు అన్ని ప్రవేట్ భూములని తేల్చి చెప్పారు …అక్కడ సిమెంట్ కంపెనీ పెట్టాలని అనుకున్నాం …అయితే చంద్రబాబు టీడీపీ పుణ్యమా అని తనపై ఈడీ కేసులతో అటాచ్ లో ఉండటంతో కంపెనీ పెట్టలేక పోయాం అని జగన్ తెలిపారు …

Related posts

జగన్ గుంటూరు పర్యటనకు అనుమతి నిరాకరణ…

Ram Narayana

అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే: జగన్ పై హోంమంత్రి అనిత వ్యంగ్య బాణాలు!

Ram Narayana

 ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఫిర్యాదు

Ram Narayana

Leave a Comment