Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

పెళ్లికి ముందురోజు కట్నం డబ్బుతో వరుడు జంప్… హైదరాబాద్ లో ఘటన!

  • వధూవరులిద్దరూ లవర్స్ 
  • పెద్దలను ఒప్పించి మరీ పెళ్లికి సిద్ధం
  • చివరిక్షణంలో షాకిచ్చిన ప్రియుడు

వాళ్లిద్దరూ లవర్స్.. నానా కష్టాలు పడి పెద్దవాళ్లను పెళ్లికి ఒప్పించారు.. మరుసటి రోజే పెళ్లి. ఇక అంతా సుఖాంతమే అనుకున్న సమయంలో పెళ్లికొడుకు… అదేనండీ ప్రియుడు… పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లికి ముందురోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. పోతూ పోతూ కాబోయే మామగారు ఇచ్చిన రూ.10 లక్షలు తీసుకుని మరీ జంప్ అయ్యాడు. ప్రియుడు ఇచ్చిన ఈ షాక్ కు పాపం ఆ ప్రియురాలు నివ్వెరపోయింది. హైదరాబాద్ లోని మారేడ్ పల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…

మారేడ్ పల్లికి చెందిన సందీప్ రమేశ్ ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంతకాలం పాటు సజావుగా సాగిన వీరి ప్రేమ కథకు తల్లిద్రండులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరూ మేజర్లే.. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయినా తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టంలేక అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలని లవర్స్ నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కష్టపడి పెద్దవాళ్లను ఒప్పించారు. ఈ నెల 8న (శుక్రవారం) వారిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు.

ప్రేమ వివాహమే అయినా కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో రూ.10 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్లలో ఇరుకుటుంబాలు తలమునకలుగా ఉండగా… గురువారం నాడు సందీప్ రమేశ్ అందరికీ షాకిచ్చాడు. డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయాడు. విషయం తెలిసిన పెళ్లికూతురు నివ్వెరపోయింది. ఈ ఘటనకు సంబంధించి పెళ్లికూతురు కుటుంబం పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

Related posts

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన..

Ram Narayana

రహస్య కెమెరాతో మహిళల నగ్న చిత్రాలు.. అమెరికాలో భారతీయ వైద్యుడి అరాచకం..

Ram Narayana

వైద్య చరిత్రలోనే అత్యద్భుతం.. మహిళకు రెండు గర్భాశయాలు..

Ram Narayana

Leave a Comment