- పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ప్రతిష్ఠాత్మక బ్రిటన్ పార్లమెంట్ ఆవార్డు
- ఏలూరి సాంబశివరావు తరపున అవార్డు అందుకున్న యూకే ఎన్ఆర్ఐ విభాగం నేత గోపాల్
- అరుదైన గౌరవం దక్కిందంటూ ఏలూరికి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
బ్రిటన్ పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ప్రతిష్ఠాత్మక విజనరీ లీడర్ అవార్డు లభించింది. అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే లండన్ వెళ్లలేకపోయారు. ఆయన తరపున యూకే ఎన్ఆర్ఐ టీడీపీ వ్యవహారాల నేత గోపాల్ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా ఏలూరి సాంబశివరావుకి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అరుదైన గౌరవరం దక్కిందని ఆయనకు కితాబునిచ్చారు. అలాగే మంత్రులు కె. అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తదితరులు సాంబశివరావుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
కాగా, ఏలూరి సాంబశివరావు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుండి వరుసగా మూడు పర్యాయాలు పర్చూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.