Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలుగు దేశం ఎంపీలు ఎందుకు సైలెంట్ అయ్యారు ?

తెలుగు దేశం ఎంపీలు ఎందుకు సైలెంట్ అయ్యారు
గల్లా జయదేవ్ , రామ్మోహన్ నాయుడు యువ ఎంపీలు ….. రెండవసారి లోకసభ కు ఎన్నికైన డైనమిక్ లీడర్లు ….. గత లోకసభలో తెలుగు దేశం వాయిస్ ఇనిపించటంలో కీలకంగా వ్యహరించారు . మంత్రులు ప్రధాని సైతం పార్లమెంట్ లో వీరి స్పీచ్ కు ఫీదా అయ్యేవారు . తెలుగుదేశం పార్టీకి మంచి యువనాయకులు దొరికారనే భావన ఇటు పార్టీలోనూ బయట కూడా భావించారు . గత ఎన్నికల్లో రాష్ట్రము అంతా వై యస్ ఆర్ కాంగ్రెస్ పవనాలు వీచినప్పటికీ ఇద్దరు యువ ఎంపీలు ఆగాలికి ఎదురొడ్డి నిలిచి విజయ బావుటా ఎగర వేశారు . కానీ నేడు వారు కొంత నిశ్శబ్దన్ని పాటిస్తున్నారు. కారణం ఏమిటనేది సందేహాలకు తావిస్తున్నది . ఈసారి వారితోపాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రమే లోకసభలో పార్టీకి ఎంపీలు గా ఉన్నారు . గతంలో తెలుగు దేశం పక్షాన గట్టిగ వాదనలు వినిపించిన ఎంపీలు కనీసం తెలుగు దేశం సమావేశాలలో కూడాకనిపించటం లేదు . మొదట్లో కొంత పార్టీ వాయిస్ వినిపించారు . అమరావతి ని రాజధానిగా కొనసాగించాలని పట్టుబట్టారు . అయితే వీరికి పార్టీలోనూ ప్రజలలో వస్తున్నా ఆదరణ కొంతమంది పార్టీలోని ముఖ్యనేతలేకే నచ్చటంలేదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి . ప్రధానంగా ఆపార్టీ యువనేత ,ప్రజల ఆదరణ ఉన్న నేతలను ఇష్టపడటం లేదనే విమర్శలు ఉన్నాయి . అధినేత చంద్రబాబు మాత్రం వీరువురు ఎంపీలను ప్రమోట్ చేయాలనీ అనుకున్న యువనేత అడ్డుపడుతున్నారేనే అభిప్రాయాలూ ఉన్నాయి . అందుకే వారు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారని పలువురికి సందేహాలు కలుగుతున్నాయి . రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత తెలుగు దేశం కష్టకాలంలో ఉంది. అనేక మంది లీడర్లు పార్టీని వీడుతున్నారు . గెలిచినా 23 మంది ఎమ్మెల్యేలలో సైతం ఇప్పటికే నలుగురు పార్టీకి దూరమైయ్యారు . మరికొంతమంది అదేబాటలో ఉన్నట్లు తెలుస్తున్నది . తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయిడు మాత్రం పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టాక పొగ కేవలం అధికార పక్షంపై ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పై గుద్ది వ్యతిరేకతతో వ్యవహరించటం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. కొందరు నేతలు ఎంత చెప్పిన తన వైఖరి మార్చుకోవటం లేదని సమాచారం . యువ ఎంపీలు పార్టీని వీడనున్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది . ఇప్పటికే గల్లా జయదేవ్ హైద్రాబాద్ లో ఉండి వ్యాపారాలు చూసుకుంటున్నారని తెలుస్తున్నది . రామ్మోహన్నాయుడు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తున్నది . చంద్ర బాబు పార్టీని దిద్ది కుంటారో లేదో చూడాలి మరి !!!

Related posts

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు చేసిన బీజేపీ!

Drukpadam

వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు: షర్మిల వార్నింగ్…

Drukpadam

మళ్ళీ .రెండు రాష్ట్రాల సీఎంల  సెంటిమెంట్  డ్రామాలు …బండి సంజయ్ విమర్శ!

Drukpadam

Leave a Comment