- బీజేపీ 40కి పైగా సీట్లు గెలుచుకోవచ్చునని అంచనాలు
- కాంగ్రెస్ కూటమి 40 సీట్ల లోపు గెలుచుకోవచ్చునని అంచనాలు
- 1 నుంచి 10 సీట్లు ఇతరులు గెలిచే అవకాశముందన్న ఎగ్జిట్ పోల్స్
ఝార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈరోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని, జేఎంఎం కూటమి సీట్లు భారీగా తగ్గే అవకాశముందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇతరులు 1 నుంచి 10 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి.
పీపుల్స్ పల్స్ – బీజేపీ కూటమి: 46 నుంచి 58, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 24 నుంచి 37
మ్యాట్రిజ్ – బీజేపీ కూటమి: 42 నుంచి 47, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 25 నుంచి 30
చాణక్య – బీజేపీ కూటమి: 45 నుంచి 50, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 35 నుంచి 38
టైమ్స్ నౌ-జేవీసీ – బీజేపీ కూటమి: 40 నుంచి 44, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 20 నుంచి 40
యాక్సిస్ మై ఇండియా – బీజేపీ కూటమి 25, ఇండియా కూటమి 53
దైనిక్ భాస్కర్ – బీజేపీ కూటమి: 37 నుంచి 40, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 36 నుంచి 39
మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే అధికారం: ఎగ్జిట్ పోల్ అంచనాలు
- బీజేపీ కూటమికి 130 నుంచి 160 సీట్లు రావొచ్చునని అంచనా
- కాంగ్రెస్ కూటమికి 120 నుంచి 140 సీట్లు రావొచ్చునని అంచనా
- బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ఓటర్ల పట్టం!
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎక్కువ పోల్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ కూటమికి 130 నుంచి 160 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
పీ మార్క్ – బీజేపీ కూటమి: 137 నుంచి 157, కాంగ్రెస్ కూటమి: 126 నుంచి 146
పీపుల్స్ పల్స్ – బీజేపీ కూటమి: 182 ప్లస్, కాంగ్రెస్ కూటమి: 97 ప్లస్
ఏబీపీ-మ్యాట్రిజ్ – బీజేపీ కూటమి: 150 నుంచి 170, కాంగ్రెస్ కూటమి: 110 నుంచి 130
చాణక్య – బీజేపీ కూటమి: 150 నుంచి 160, కాంగ్రెస్ కూటమి: 130 నుంచి 138
సీఎన్ఎస్-న్యూస్ 18 – బీజేపీ కూటమి: 154, కాంగ్రెస్ కూటమి: 128
లోక్ శాహి మరాఠి – బీజేపీ కూటమి: 128 నుంచి 142, కాంగ్రెస్ కూటమి: 125 నుంచి 140
దైనిక్ భాస్కర్ – బీజేపీ కూటమి: 128 నుంచి 140, కాంగ్రెస్ కూటమి: 135 నుంచి 150