Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌డే చేసుకున్న రోజే విషాద ఘ‌ట‌న‌!

  • అట్లాంటాలో ఎంఎస్ చ‌దివేందుకు వెళ్లిన‌ ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డి
  • ఈ నెల 13న స్నేహితుల‌తో క‌లిసి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌
  • అదే రోజు త‌న వ‌ద్ద ఉన్న తుపాకీని క్లీన్ చేసే క్ర‌మంలో మిస్‌ఫైర్‌
  • అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపిన అమెరికా పోలీసులు

అమెరికాలో తెలుగు యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డి (23) త‌న పుట్టిన రోజు జ‌రుపుకున్న రోజే ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌న వ‌ద్ద ఉన్న తుపాకీని క్లీన్ చేసే క్ర‌మంలో అది మిస్‌ఫైర్ కావ‌డంతో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అమెరికా పోలీసులు వెల్ల‌డించారు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. ఉప్ప‌ల్ కళ్యాణ్ పురికి చెందిన ఆర్య‌న్ రెడ్డి అమెరికాలోని జార్జియా స్టేట్ అట్లాంటా న‌గ‌రంలో ఎంఎస్ చ‌దువుతున్నాడు. ఈ నెల 13న ఆర్య‌న్ బ‌ర్త్‌డే. దీంతో స్నేహితుల‌తో క‌లిసి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నాడు. అయితే అదే రోజు బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ముగిసిన త‌ర్వాత త‌న వ‌ద్ద ఉన్న తుపాకీని శుభ్రం చేసే క్ర‌మంలో అది మిస్‌ఫైర్ అయి ఆర్య‌న్ ప్రాణాలు కోల్పోయాడ‌ని యూఎస్ పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో మృతుడి స్వ‌స్థ‌లం క‌ళ్యాణ్ పురిలో విషాదం అలముకుంది. ఆర్య‌న్ త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. 

Related posts

మైక్రోసాఫ్ట్ లో లోపం పలు విమానాలు రద్దు …శంషాబాద్ లో సిబ్బందిపై తిరగబడ్డ ప్రయాణికులు!

Ram Narayana

రూ.175 కోట్లు కాజేశారు… హైదరాబాద్ లో భారీ సైబర్ చౌర్యం!

Ram Narayana

చైతన్యపురిలో ఈటల రాజేందర్ ర్యాలీ… మొరపెట్టుకున్న మూసీ నిర్వాసితులు…

Ram Narayana

Leave a Comment