ఎస్ ఎస్ ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఉద్యేగం ,ఉత్సహం ,ఉద్విగ్నం
పరిచయాలు, పలకరింపులు , గ్రూప్ ఫోటోలులతో కోలాహలం
ఎస్ ఆర్ గార్డెన్ ను ఎస్ ఎఫ్ ఐ పోస్టర్లతో,పూలతో అందంగా అలంకరణ
గత స్మృతులు నెమరువేసుకున్న సహచరులు , స్నేహితులు
రెండు వేలమందికి పైగా హాజరు

ఆదివారం ఖమ్మం ఎస్ ఆర్ గార్డెన్ వేదికగా జరిగిన ఎస్ ఎఫ్ ఐ పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఉద్యేగం ,ఉత్సహం ,ఉద్విగ్నం వాతావరణంలో అత్యంత ఆనంద డోలికల మధ్య అద్భుతంగా, రమణీయం, కమనీయంగా జరిగింది …సమ్మేళనం ప్రారంభానికి ముందు ఎస్ ఎఫ్ ఐ పతాకాన్ని ఎస్ ఎఫ్ ఐ ఉద్యమ సీనియర్ నేత కొండపల్లి పవన్ ఆవిష్కరించారు …అనంతరం ఎస్ ఎఫ్ ఐ ఉద్యమంలో ,తర్వాత ప్రజాతంత్ర ఉద్యమాల్లో కీలక భూమిక పోషించి ఇటీవలనే మరణించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి ,ఖమ్మం జిల్లా ఉద్యమ నిర్మాత మాటూరు రామచందర్ రావుల ఫోటోలకు నివాళులు అర్పించారు …కళాకారులు మృత వీరులను స్మరిస్తూ పడిన పాటలు ఆలోచింప చేసేవిగా ఉన్నాయి…ఏచూరి ప్రాగణం ముందు ఏర్పాటు చేసిన మృత వీరుల స్తూపంతో పాటు, జెండా ఆవిష్కరణ ప్రాంతం , ద్వారం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన దగ్గర నిల్చొని కలిసి ఫోటోలు దిగారు …నాటి ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు ..నువ్వు ఆ కాలేజీ , నేను ఈ కాలేజీలో గెలిచినా అంటూ అనుభవాలను పంచుకున్నారు .. అరే నన్ను గుర్తు పట్టావా..? నువ్వు ఎలా అయిపోయావు ఏమిటి , నువ్వు అలాగానే ఉన్నవురా … అంటూ కొందరు , మీరు ఏమి చేస్తున్నారు … మీ పిల్లలు ఏమి చేస్తున్నారు …ఆరోగ్యం ఎలా ఉంది … అంటూ కుశల ప్రశ్నలు ,వేసుకున్నారు ..ఇక్కడకు రాని నాటి స్నేహితులను గురించి ఆరాతీశారు …ఇలా పరిచయాలు పలకరింపులతో ఏచూరి ప్రాంగణం (ఎస్ ఆర్ గార్డెన్) కోలాహలంగా మారింది ..వేయి నుంచి 15 వందలమంది వస్తారని అనుకుంటే 2 వేలమందికి పైగా హాజరైయ్యారు …స్టేజీని డిజిటల్ ప్రేమ్ తో చేసిన అలంకరణ చూపరులను ఆకర్షించింది …సభకు వెలంపల్లి శ్రీనివాస్ రావు , అనురాధ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు …1970 నుంచి ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేసిన వారిని అందరిని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించారు …పార్టీలు మారినప్పటికీ రాజకీయ అభిప్రాయాలూ వేరు వేరుగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరై నిర్వాకులను అభినందించారు …ఇది గొప్ప అనుభూతి అని అభిప్రాయపడ్డారు …


రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలి …ఎస్ ఎఫ్ ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ పిలుపు నిచ్చారు …దేశంలో నెలకొన్న పరిస్థితులు రాజ్యాంగంపై దాడి నేపథ్యంలో ఇది అత్యంత ముందుకు వస్తున్నా సమస్యగా ఉందని అన్నారు …ఉద్యమాల చరిత్రలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది అందులో నాడు ఎస్ ఎఫ్ ఐ లో పనిచేసిన వారు తమ అభిప్రాయాలు పక్కన పెట్టి ఈ అపూర్వ సమ్మేళనానికి రావడం అభినందనీయమని అయితే ఎలాంటి సమావేశాలు , సమ్మేళనాలు ఆరంభ శూరత్వంగా ఉండకూడదని అన్నారు …ఇది మంచి ప్రయత్నమని రాష్ట్రమంతటా దీన్ని కొనసాగించాలని పేర్కొన్నారు …
మరో అతిధిగా పాల్గొన్న ఎస్ ఎఫ్ ఐ పూర్వ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి వి .క్రిష్ణయ్య మాట్లాడుతూ
దేశంలో బీజేపీ రూపంలో ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం పొంచు ఉందని మనం అధ్యయనం -పోరాటం ఇచ్చిన నినాదం కొనసాగిస్తూనే ముందుకు సాగాలని అన్నారు …ప్రపంచంలో జరుగుతున్నా పరిణామాలు సోషలిజమే మానవజాతి విముక్తికి పరిష్కారమార్గం నిరూపిస్తున్నాయని అన్నారు …ఖమ్మంలో ఎస్ ఎఫ్ ఐ పూర్వ విద్యార్థుల కలయిక అపూర్వ ఘట్టంమని ఇంత పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించడం నిజంగా
స్వాతంత్య్రం , ప్రజాస్వామ్యం , సోషలిజం , కలిపిందని అన్నారు …ఎవరు ఎక్కడ ఉన్న రాంజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలనీ కోరారు …
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాడు ఎస్ ఎఫ్ ఐ నేర్పిన క్రమ శిక్షణ జీవితంలో ఉపయోగపడిందని అన్నారు …నాటి స్మృతులను గుర్తు చేశారు …

తొలుత ఎస్ ఎఫ్ ఐ మాజీ విద్యార్థుల వేదిక కన్వీనర్ మన్నేపల్లి సుబ్బారావు , ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుకు దారి తీసిన ఆలోచనలు మాజీల నుంచి లభించిన ఆదరణ , గురించి వివరించారు ….
ప్రారంభంలో ఎస్ ఎఫ్ ఐ అఖిల భారత అధ్యక్షులు , సిపిఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన సీతారాం ఏచూరికి , ఖమ్మం జిల్లా ఉద్యమ నిర్మాత మాటూరు రామచందర్ రావు తోపాటు మృత వీరులకు జోహార్లు అర్పించి మౌనం పాటించారు . వి. లక్ష్మి నారాయణ సభికుల చేత రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు …
కార్యక్రమంలో మాజీ ఎస్ ఎఫ్ ఐ నేత జనగామ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు , పూర్వ విద్యార్ధి సంఘ నేతలు డి ,నాగేశ్వర్ రావు ,పట్టాభి , బి వెంకట్ , సాయిబాబా,బి .చావా రవి బి.రాజేశ్వర్ రావు , వి .లక్ష్మీనారాయణ , విశ్వేశరరావు ,పాలడుగు భాస్కర్ ,కళ్యాణం వెంకటేశ్వరరావు , విజయ్ భాస్కర్ , నరసింహ రెడ్డి పావని ,లేనినా చౌదరి , జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ,గ్రంధాల సంస్థ మాజీ చైర్మన్ ఎండి ఖమర్ ,తదితరులు పాల్గొన్నారు …


