- జనరల్ ప్రయాణికులకు మాత్రం వర్తించదు
- రిజర్వేషన్ టికెట్ తో వినియోగదారుల ఫోరంలో కేసు వేయొచ్చు
- రైల్వే శాఖ సమాచారం ఇస్తే మాత్రం ఈ అవకాశం లేదు
మన దేశంలో రైళ్లు ఆలస్యానికి పెట్టింది పేరు.. దీనిపై పలు జోకులు కూడా వాడుకలో ఉన్నాయి. అసలే ఆలస్యంగా వచ్చిన రైలు మధ్యమధ్యలో ఆగుతూ మరింత ఆలస్యం చేసి ఎప్పటికోగానీ గమ్యానికి చేరుస్తుంటాయి. అరగంట నుంచి ఆరేడు గంటల దాకా రైళ్లు ఆలస్యంగా నడిచిన సందర్భాలు కోకొల్లలు. ఇలా ఆలస్యంగా నడవడం వల్ల ముఖ్యమైన పనుల కోసం ప్రయాణించే వారు నష్టపోతుండడం సహజమే. రైల్వే కారణంగా ఇలా నష్టపోయిన మొత్తాన్ని వినియోగదారుల ఫోరం సాయంతో రాబట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయట. అవేంటంటే..
- జనరల్ బోగీలో ప్రయాణించే వారికి కేసు వేసే అవకాశం లేదు. రిజర్వుడు బోగీలో ప్రయాణించే వారికే అవకాశం.
- రైలు కనీసం 3 గంటలకు పైగా ఆలస్యం అయిన సందర్భంలోనే కేసు వేయొచ్చు.
- ఆలస్యానికి కారణాలను రైల్వే ముందే చెప్పినా లేక ప్రయాణ సమయంలో చెప్పినా రైల్వే శాఖ బాధ్యత ఉండదు.
- ఎలాంటి కారణం చెప్పకుండా ఉంటే మాత్రం రిజర్వుడు టికెట్ ను సాక్ష్యంగా చూపుతూ ఫోరంలో కేసు వేసి పరిహారం పొందవచ్చు.
- ప్రమాదాలు, పకృతి వైపరీత్యాల కారణంగా ఆలస్యమైతే మాత్రం రైల్వే శాఖ టికెట్ డబ్బులను వాపస్ చేస్తుంది.