Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం …ఇద్దరు మృతి పలువురికి గాయాలు

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన లారీ.. కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లింది. దీంతో, పెను ప్రమాదం జరిగింది.
హైదరాబాద్‌ -బీజాపుర్‌ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దూసుకొస్తున్న లారీని చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీకొట్టి ఆగింది. లారీ డ్రైవర్‌ మాత్రం క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో అన్‌లోడ్‌ చేసి తిరిగి వికారాబాద్‌ వెళ్తున్న క్రమంలో లారీ అదుపుతప్పడంతో ఈ ఘటనకు చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనతో హైదరాబాద్‌- బీజాపుర్‌ రహదారిపై భీతావహ వాతావరణం నెలకొంది. లారీ సృష్టించిన బీభత్సంలో మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్‌ (ఆలూరు), సుజాత (ఖానాపూర్‌)గా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు వంద మీటర్ల దూరం నుంచే లారీ అదుపు తప్పిన విషయాన్ని గమనించిన కూరగాయల వ్యాపారులు పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కూలిన చెట్టును జేసీబీతో పక్కకు తొలగించారు. ఘటనా స్థలానికి కి.మీల దూరంలో నిన్న కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొని బీడీఎల్‌ ఉద్యోగి దంపతులు నిన్న దుర్మరణం చెందారు. వరుస ప్రమాదాలతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డును విస్తరించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Related posts

కేరళ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురి మృతి

Ram Narayana

షార్ట్ సర్క్యూట్‌తో భవనంలో మంటలు.. ఏడుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం!

Ram Narayana

టిబెట్ – నేపాల్ సరిహద్దులో పెను భూకంపం.. 32 మంది దుర్మరణం!

Ram Narayana

Leave a Comment