Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

డిసెంబర్ 5న ఇందిరమ్మ ఇండ్ల యాప్ ప్రారంభం……మంత్రి పొంగులేటి

నేలకొండపల్లి మండలంలో పర్యటించి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, లబ్దిదారులకు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులు అందించిన మంత్రి పొంగులేటి

డిసెంబర్ 5న తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్ ను ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేలకొండపల్లి మండలంలో పర్యటించి ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. నిధులతో గువ్వలగూడెంలో 25 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, కొత్త కొత్తూరులో 20 లక్షలతో, భైరవునిపల్లిలో 25 లక్షలతో,
రాయి గూడెంలో 30 లక్షలతో, మంగాపురం తండాలో 40.2 లక్షలతో నిర్మించనున్న సి.సి. రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి కొత్త కొత్తూరులో నేలకొండపల్లి మండలానికి చెందిన 28 మంది లబ్దిదారులకు సుమారు 10 లక్షల రూపాయల సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డిసెంబర్ 3 నాటికీ ఎన్నికల ఫలితాలు వచ్చి సంవత్సరం అవుతుందని, ప్రజల ఆకాంక్షల మేరకు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడిందని, మీరు ఆశీర్వదించి గెలిపించినందుకు తాను మంత్రి స్థాయికి ఎదిగానని అన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలు, తరువాత అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు మన వారిగానే భావించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతును రాజు చేసే దిశగా అన్ని కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. సంవత్సర కాలంలో ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియజేసేందుకు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు.

నవంబర్ 30న మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతంగా లక్షలాది మంది రైతుల సమక్షంలో రైతుల పండుగ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఆర్థికంగా రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని, అందులో భాగంగా రైతుల పండగ సందర్భంగా నాల్గవ విడత సుమారు 2800 కోట్ల రైతు రుణమాఫీ సొమ్ము విడుదల చేసామని, ఇప్పటి వరకు 21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ మన ప్రభుత్వం ఇస్తుందని, సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా నిధులు కూడా అందిస్తామని అన్నారు.

డిసెంబర్ 5న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను ప్రాంభించుకుంటున్నామని, డిసెంబర్ 6 నుంచి ప్రతి గ్రామానికి బృందాలు వచ్చి నిరు పేదలను మొదటి విడతలో లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి అధికంగా ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.

ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా పేదలకు 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తున్నామని అన్నారు. రాబోయే 4 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహారావు, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వి. సీతారాములు, నేలకొండపల్లి తహసీల్దార్ మాణిక్య రావు, ఎంపీడీఓ. ఎర్రయ్య, ఏ.డి.ఏ. భూక్యా సరిత, ఏ.ఓ. రాధ, ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్ డి.ఈ. వంశీ, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తుమ్మల,బాలసానిని మర్యాద పూర్వకంగా కలిసిన భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య

Ram Narayana

ఖమ్మం మార్కెట్లోకి ఒకే రోజు బజాజ్ సిఎన్జి బైకులు, మహేంద్ర తార్ రాక్స్ వాహనాలు విడుదల! .

Ram Narayana

20 స్థానాలు పెరిగితే రాజకీయ ముఖ చిత్రం మారేది…

Ram Narayana

Leave a Comment