Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ వార్తలు ...

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి 14ఏళ్లకు న్యాయం..1.99 కోట్ల పరిహారం అందజేత…

  • రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.1.99కోట్ల పరిహారం చెక్కు అందజేత
  • జాతీయ లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారం
  • 2010లో రోడ్డు ప్రమాద ఘటన

రోడ్డు ప్రమాదం కారణంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 14 ఏళ్లకు న్యాయం జరిగింది. 2010లో నంద కిశోర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అతని భార్య పి శ్వేత, కుమార్తె సుదీక్షణ్ నందినీరెడ్డి రూ.2కోట్ల పరిహారం కోరుతూ మోటారు వాహనాల ప్రమాద కేసుల ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై సుదీర్ఘకాలం విచారించిన ట్రైబ్యునల్ ఈ ఏడాది జూన్‌లో రూ.1.08 కోట్ల పరిహారం మాత్రమే చెల్లించాలని లారీ యజమాని, బజాజ్ ఇన్సూరెన్స్ తదితరులకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి వారి కేసును పరిష్కరించింది. 

ఇరుపక్షాల మధ్య రాజీకుదిర్చి బాధితులకు రూ.1.99 కోట్లు పరిహారంగా ప్రకటించింది. శనివారం హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో రూ.1.99 కోట్ల చెక్కును న్యాయమూర్తుల చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. 

Related posts

నాపై మంత్రి కొండా సురేఖ అసహ్యంగా మాట్లాడారు …కోర్ట్ లో కేటీఆర్ వాంగ్మూలం ..

Ram Narayana

జడ్జి-అడ్వొకేట్ మధ్య తీవ్ర వాగ్వాదం… కోర్టులో తీవ్ర ఉద్రిక్తత..!

Ram Narayana

లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డితోపాటు 24 మంది నిందితులకు బెయిల్..!

Ram Narayana

Leave a Comment