శాసనసభలో నవ్వులు పూయించిన బావబామ్మర్దుల సంభాషణ…
డివిజన్లు ,మండలాలు ఏర్పాటుపై శానసనసభలో చర్చ
ఆసక్తి గొల్పిన మంత్రులు పొంగులేటి …కోమటిరెడ్డి మధ్య చుట్టిరిక ప్రస్తావన
బావగారు ఆథరైజ్ చేశారు …తప్పకుండ పరిశీలిస్తామన్న పొంగులేటి
తెలంగాణ శాసనసభలో మంగళవారం బావబామ్మర్దుల సంభాషణ నవ్వులు పూయించింది …రాష్ట్రంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు , మండలాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెపుతూ గౌరవ సభ్యులు కొందరు రెవెన్యూ డివిజన్లు కావాలని , మరికొందరు మండలాలు కావాలని అడిగారు …సభ్యులు అడిగిన విషయాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకొని తప్పకుండ పరిశీలన చేస్తామని ఈ విషయంలో సీఎం ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు …అంతకు ముందు మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ తమ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన డివిజన్ ,మండలాల గురించి రెవెన్యూ మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేయడంతో స్పందించిన మంత్రి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కూడా చెప్పారు … మా బావగారు,సహచర మంత్రి ఆథరైజ్ చేశారు … అది కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది …తప్పకుండా పరిశీలిస్తమన్నారు దీంతో సభలో బావగారి ప్రస్తావన తోటి సభ్యులను నవ్వులు పూయించింది …మంత్రుల సంభాషణ సభలో ఆసక్తి గొల్పింది …