అంతర్జాతీయం

అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం.. కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ!


అమెరికాలోని కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) కలకలం రేపుతోంది. 34 మంది ఈ వైరస్ బారిన పడడంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తూ గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ డెయిరీ ఫాంలోని ఆవుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. 

వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సంక్రమించిన ఆధారాలు లభించలేదని గవర్నర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడిన వారందరూ ఆ డెయిరీ ఫాంలో పనిచేసినవారు, అక్కడికి దగ్గర్లో ఉన్నవారేనని వివరించారు. ఈ వైరస్ వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.

Related posts

పనామా కాలువపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana

ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన పుతిన్…

Ram Narayana

ఈజిప్టు వేదికగా భార‌త ప్ర‌ధానిని పొగిడిన ట్రంప్…

Ram Narayana