పార్లమంట్ న్యూస్ ...

పార్లమెంట్ ఆవరణలో ఎంపీల డిష్యుం ..డిష్యుం

బీజేపీ ఎంపీలు నన్ను నెట్టేశారు… నాకు గాయమైంది: లోక్ సభ స్పీకర్ కు ఖర్గే లేఖ

  • అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు
  • పార్లమెంటు ప్రాంగణంలో తోపులాట
  • తన మోకాళ్లకు గాయమైందన్న ఖర్గే
  • విచారణ జరిపించాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ

అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విపక్షాలను ఆగ్రహావేశాలకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో, నేడు పార్లమెంటు ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఎన్డీయే, ఇండియా కూటమి పక్షాల ఎంపీల మధ్య తోపులాట జరగ్గా… బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేశ్ రాజ్ పుత్ గాయపడ్డారు. 

వీరిలో ప్రతాప్ చంద్ర సారంగికి తలకు లోతైన గాయం కావడంతో వైద్యులు కుట్లు వేశారు. ఈ ఇద్దరు ఎంపీలకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందించారు. 

ఈ క్రమంలో, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మకర్ ద్వార్ ఎంట్రన్స్ దగ్గర జరిగిన ఘర్షణ సందర్భంగా బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని,దాంతో తాను అదుపుతప్పి కిందపడిపోయానని వెల్లడించారు. 

తన మోకాళ్లకు గాయమైందని ఆ లేఖలో పేర్కొన్నారు. తన మోకాళ్లకు అప్పటికే శస్త్రచికిత్స జరిగిందని, ఇప్పుడు కిందపడడంతో గాయం ప్రభావం మోకాళ్లపై ఎక్కువగా పడిందని ఖర్గే వివరించారు. వెంటనే కాంగ్రెస్ ఎంపీలు ఓ కుర్చీ తీసుకురావడంతో దానిపై కూర్చున్నానని తెలిపారు. అక్కడ్నించి తాను కుంటుతూనే సభకు వెళ్లానని పేర్కొన్నారు. 

ఈ తోపులాట ఘటనపై విచారణ జరిపించాలని తన లేఖలో డిమాండ్ చేశారు. రాజ్యసభ విపక్ష నేతపై ఇలాంటి దాడి జరగడం గర్హనీయమని వివరించారు.

పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ ఇష్యూపై ఆందోళన చేపట్టారు అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు. పోటాపోటీగా జైభీమ్ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ముందు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎదురుపడ్డారు. అక్కడ జరిగిన స్వల్ప తోపులాటలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగీ, ముఖేష్ రాజ్ పుత్ కింద పడ్డారు. రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోసేయడంతో అతను తనపై పడ్డారన్నారు. ఈ క్రమంలోనే తాను కిందపడ్డానని తెలిపారు బీజేపీ ఎంపీ సారంగీ. ఆయన్ను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ కిందపడటంపై స్పందించారు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. పార్లమెంట్ లోకి వెళ్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. తనను నెట్టివేసి బెదిరించారన్నారు. ఆ సమయంలో తోపులాట జరడంతోనే బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ కింద పడ్డారన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మీడియా కెమెరాల్లో ఉండొచ్చన్నారు రాహుల్. మల్లిఖార్జున ఖర్గేను కూడా బీజేపీ ఎంపీలు నెట్టివేశారన్నారు. పార్లమెంట్లోకి వెళ్లకుండా బీజేపీ నేతలు అడ్డుకున్నారని.. అందులోకి వెళ్లే హక్కు ఉందన్నారు రాహుల్.
అంబేద్కర్ ఇష్యూపై పార్లమెంట్ ఆవరణలో ఇండియా, ఎన్డీయేల ఆందోళనలు చేపట్టాయి. మీరంటే మీరు అంబేద్కర్ ను అవమానించారని నిరసనలు తెలుపుతున్నారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా.. కేంద్రహోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక అసలు అంబేద్కర్ ను అవమానించిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ఎదురుదాడికి దిగారు బీజేపీ ఎంపీలు. భారత రత్న ఇవ్వకుండా బాబాసాహెబ్ ను అవమానించారన్నారు.

Related posts

50 లక్షల 65 వేల కోట్లతో కేంద్రం భారీ వార్షిక బడ్జెట్!

Ram Narayana

రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన రేణుకా చౌదరి

Ram Narayana

మీరు నాకు చెప్పొద్దు.. నా అనుభవం 30 ఏళ్లు!: రాహుల్‌ పై అమిత్ షా తీవ్ర ఆగ్రహం…

Ram Narayana