Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అప్పుల పాపం బీఆర్ యస్ దే…శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి

అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై స్వల్పకాల చర్చ జరిగింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం అప్పుల వివరాలను వెల్లడించారు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క. రాష్ట్రంలో మొత్తం అప్పులు 6 లక్షల 71 వేల కోట్లు ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే రూ.7 లక్షల 10 వేల కోట్లు ఉన్నట్లు తెలిపారు.
లక్ష కోట్ల అప్పులు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్ఆర్బిఎం నిబందధనలకు లోబడి రూ.52 వేల కోట్ల అప్పు తెచ్చామని, అంతకు మించి అప్పు చేయలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులే రూ.41 వేల కోట్లు కట్టామని,
43 వేల కోట్ల అప్పులు తీర్చామనితెలిపారు. అదేవిధంగా రూ.26 కోట్ల మిత్తీలు కట్టామని తెలిపారు. బీఆర్ఎస్ పెట్టిన పెండింగ్ బిల్లులలో 12 వేల కోట్లు కట్టామని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చెప్పడంలో ఆరితేరిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్లలో అప్పులు తప్ప చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడినపెడుతున్నామని తెలిపారు.

భట్టి మాటల్లో నిజంలేదన్న హరీష్ రావు …

డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్కకు సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు..
నేతి బీరకాయలో ఎంతనో భట్టి మాటల్లో నిజాయితీ అంత..భట్టి చెప్పినట్లు BRS హయాంలో మెస్ చార్జీలు, రైతుల ఇన్సూరెన్స్ డబ్బులు మేం ఇవ్వకుంటే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లెటర్ ఇస్తా..ఒకవేళ భట్టి మాటలు అబద్దం అని రుజువైతే ఆయన రాజీనామా చేయాలి అన్నారు ..

Related posts

నా తండ్రి పేరు చెప్పుకుని ఇక్కడి వరకు రాలేదు: నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

Ram Narayana

మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ శాసనసభ…

Ram Narayana

అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఫైర్.. సంధ్య థియేటర్ ఘటనకు ఆయనే కారణం …

Ram Narayana

Leave a Comment