Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ శాసనమండలి ప్రొటెం స్పీకర్ గా విఠపు బాలసుబ్రహ్మణ్యం… గవర్నర్ ఆమోదం…

ఏపీ శాసనమండలి ప్రొటెం స్పీకర్ గా విఠపు బాలసుబ్రహ్మణ్యం… గవర్నర్ ఆమోదం…
శాసనమండలిలో నలుగురు కొత్త సభ్యులు
ఇటీవల ముగిసిన చైర్మన్ మహ్మద్ షరీఫ్ పదవీకాలం
కొత్త సభ్యులతో ప్రమాణం చేయించేందుకు ప్రొటెం స్పీకర్
విఠపు పేరును సిఫారసు చేసిన సీఎం జగన్

ఏపీ శాసనమండలిలో నలుగురు కొత్త సభ్యులు వస్తున్నారు. గవర్నర్ నామినేట్ చేసిన వైసీపీ సభ్యులు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్ కొత్త ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఇప్పటివరకు మండలి చైర్మన్ గా వ్యవహరించిన మహ్మద్ షరీఫ్ ఇటీవల రిటైర్ అయ్యారు.

ఇప్పుడు ఆ నలుగురు కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రొటెం స్పీకర్ అవసరం కాగా, విఠపు బాలసుబ్రహ్మణ్యం పేరును సీఎం జగన్ ప్రతిపాదించారు. సీఎం సిఫారసు మేరకు ఏపీ శాసనమండలి ప్రొటెం స్పీకర్ గా విఠపు బాలసుబ్రహ్మణ్యం ఎంపికను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. త్వరలోనే కొత్త సభ్యులతో విఠపు మండలిలో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించటంతో పాటు ,మండలి చైర్మన్ ,వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా ఉంటుంది. చైర్మన్ ఎన్నికయ్యేవరకు సుబ్రమణ్యమే ప్రొటెం మండలి చైర్మన్ గా వ్యవహరించనున్నారు .

Related posts

టర్కీ, సిరియా దేశాల్లో భూకంపాలపై మూడ్రోజుల ముందే హెచ్చరించిన డచ్ పరిశోధకుడు…

Drukpadam

సీఎం జగన్  సహనశీలి  :శాసన మండలి చైర్మన్ షరీఫ్!

Drukpadam

బిఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి, జూప‌ల్లి స‌స్పెండ్ ..

Drukpadam

Leave a Comment