Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

అమెరికాలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి…

  • హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్ప‌ద మృతి
  • గ‌తేడాది ఉన్నత‌ చ‌దువుల కోసం మిన్నెసొటాకు వెళ్లిన యువ‌కుడు
  • అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఉన్న కారులో శ‌వ‌మై క‌నిపించిన వైనం 

అమెరికాలో మ‌రో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. తెలంగాణ‌లోని హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయాడు. అత‌డు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని సెల్లార్‌లో ఉన్న కారులో శ‌వ‌మై క‌నిపించాడు. ఈ మేర‌కు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఆదివారం నాడు స‌మాచారం అందింది. 

హ‌నుమ‌కొండ జిల్లా క‌మ‌లాపూర్ మండ‌లం మాద‌న్న‌పేట గ్రామానికి చెందిన గీత‌కార్మికుడు బండి రాజయ్య‌, ల‌లిత దంప‌తుల రెండో కుమారుడు బండి వంశీ (25). గ‌తేడాది జులైలో ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికాలోని మిన్నెసొటాకు వెళ్లాడు. అక్క‌డ పార్ట్‌టైం జాబ్ చేస్తూ.. ఎంఎస్ చ‌దువుతున్నాడు. 

ఈ క్ర‌మంలో అత‌డు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న ఓ కారు సీట్‌లో మృతిచెంది ఉండ‌డం అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న హ‌నుమ‌కొండ జిల్లాకే చెందిన యువ‌కులు ఆదివారం ఉద‌యం గుర్తించారు. వెంట‌నే వంశీ పేరెంట్స్‌కు స‌మాచారం ఇచ్చారు. చేతికి అందివ‌చ్చిన కొడుకు ఇలా అర్ధాంత‌రంగా త‌నువు చాలించ‌డంతో త‌ల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 

ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వొడిత‌ల ప్ర‌ణ‌వ్ మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. వారి కుమారుడి మృత‌దేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్ర‌భుత్వంతో మాట్లాడతాన‌ని వంశీ పేరెంట్స్‌కు ఆయ‌న‌ హామీ ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌తో మాద‌న్న‌పేట గ్రామంలో విషాదం అలముకుంది. 

Related posts

రైతు భరోసాపై కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు!

Ram Narayana

ప్రభుత్వ పాలన పట్ల 100 శాతం ప్రజలు సంతోషంగా ఉంటారనుకోవడం లేదు: భట్టి విక్రమార్క

Ram Narayana

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ నో …

Ram Narayana

Leave a Comment