- అమెరికాలోని హవాయ్ దీవుల్లో ఉన్న కిలౌవా అగ్నిపర్వతం
- ఉన్నట్టుండి ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం
- సుమారు 265 అడుగుల ఎత్తున ఫౌంటేన్ లా లావాను విరజిమ్ముతున్న తీరు
- సమీపంలోని కొండపై కెమెరా అమర్చి యూట్యూబ్ లో లైవ్ పెట్టిన అమెరికా జియాలాజికల్ సర్వే విభాగం
అమెరికాలోని హవాయ్ దీవుల్లో ఉన్న కిలౌవా అగ్నిపర్వతం… ఒక్కసారిగా బద్దలైంది. భారీ శబ్ధంతో లావా బాంబులు, విషవాయువులను ఎగజిమ్మింది. ఆ తర్వాత నుంచి భారీ స్థాయిలో లావా వెలువడుతోంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయం (మన కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయం)లో ఈ అగ్నిపర్వతం బద్దలవడం మొదలైందని అమెరికా జియాలజికల్ సర్వే (యూఎస్ జీఎస్) విభాగం ప్రకటించింది.
వందల అడుగుల ఎత్తులో లావా విరజిమ్ముతూ…
అగ్నిపర్వతం బద్దలైనప్పటి నుంచి భారీగా లావా వెలువడుతోంది. 265 అడుగుల ఎత్తున అంటే సుమారు 20 అంతస్తుల భవనం ఎంత ఎత్తుతో.. ఓ పెద్ద ఫౌంటెయిన్ లా లావాను విరజిమ్ముతోంది. దీనితో అమెరికా జియాలాజికల్ సర్వే విభాగం సమీపంలోని కొండపై కెమెరా అమర్చి యూట్యూబ్ లో లైవ్ వీడియో పెట్టింది. ఈ అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో జనావాసాలు లేకపోవడం వల్ల ప్రస్తుతానికి భారీ ప్రమాదమేమీ లేదని ప్రకటించింది.