- 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించిన అన్నామలై
- అన్నా యూనివర్సిటీ కేసులో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారని ఆగ్రహం
- బాధితురాలి పేరు, ఫోన్ నెంబర్‌ను లీక్ చేశారన్న అన్నామలై
తమిళనాట డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను చెప్పులు ధరించనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రతిజ్ఞ చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆయన వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల అంశంపై రాజకీయ దుమారం రేగింది. ఈ అంశంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం నాడుకోయంబత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్నా యూనివర్సీటీలో జరిగిన లైంగిక వేధింపుల కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, నిరసనలో భాగంగా శుక్రవారం నాడు తన నివాసం వద్ద ఆరుసార్లు కొరడాతో కొట్టుకుంటానన్నారు. రేపటి నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే పార్టీని గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనన్నారు.
అన్నా యూనివర్సిటీ కేసుకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని అధికారులు లీక్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో బాధితురాలికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారని మండిపడ్డారు. ఆమె పేరును, ఫోన్ నెంబర్‌ను ఎఫ్ఐఆర్ ద్వారా లీక్ చేశారని మండిపడ్డారు. తద్వారా పోలీసులు ఈ కేసులో సరిగ్గా వ్యవహరించలేకపోయారన్నారు.