మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అస్తమయం
దశాబ్దకాలం దేశానికి ప్రధానిగా సేవలు
ఐదు సంవత్సరాలు ఆర్దికమంత్రిగా భాద్యతలు
దేశవిదేశాలలో దిగ్బ్రాంతి పలువురు ప్రముఖుల సంతాపం
భారత్ గర్వించదగ్గ వ్యక్తులలో ఒకరు
ఆర్థిక వేత్తగా పలుసంస్కరణలు
భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు ,దేశఅత్యుత్తమ నేతల్లో ఒకరు దశాబ్దకాలం ప్రధానిగా సేవలందించిన ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ( 92 ) కన్ను మూశారు …మన్మోహన్ సింగ్ సెప్టెంబరు 26, 1932న ప్రస్తుతం పాకిస్థాన్‌లో భాగమైన పశ్చిమ పంజాబ్‌లోని గాహ్‌లో జన్మించారు. ఆయన ముగ్గురు కుమార్తెలు , భార్య ఉన్నారు …
ప్రధాని మోడీ ,హోమ్ మంత్రి అమిత్ షా ,రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే , లోకసభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ,కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , ఎంపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణ , కర్ణాటక ,ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి , సిద్దరామయ్య తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు …
ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు …గురువారం ఆయన ఆరోగ్యం క్షిణించడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్చారు …రాష్ట్ర 9.51 గంటలకు కన్ను ముసినట్లు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు …ఆయన వివిధ హోదాలలో దేశానికి సేవలు అందించారు ..1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్దికశాఖామంత్రిగా పనిచేశారు …దేశం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు ..ఆయన తెచ్చిన సంస్కరణల వల్లనే దేశం ఆర్థికరంగంలో పురోగతి సాధించి ప్రపంచంలోనే ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా రూపొందటం జరిగింది …2004 లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూపీఏ అధికారంలోకి రావడంతో సోనియా గాంధీ తాను ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ , ప్రణబ్ ముఖర్జీ లాంటి రాజకీయ ఉద్దండులు ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ కు ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఇచ్చారు ..తనకు కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవి కట్టబెట్టిన ఇప్పుడు నిండుకుండలాగా ఉన్నారు తప్ప పొంగిపోలేదు ..అంతకు ముందు చేసిన అనేక పదవులను అనుభవంతో ప్రధానిగా ,ఆర్థిక వేత్తగా ప్రపంచ దేశాధినేతల ప్రసంశలు పొందగలిగారు మన్మోహన్ సింగ్ …
ఢిల్లీలోని AIIMS మెడికల్ బులెటిన్‌లో సింగ్ మరణాన్ని ప్రకటించింది. “ప్రగాఢమైన సంతాపంతో, 92 సంవత్సరాల వయస్సులో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణాన్ని మేము తెలియజేస్తున్నాము. వయో సంబంధమైన వైద్య పరిస్థితులకు చికిత్స పొందుతున్నారు … డిసెంబర్ 26, 2024న ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. పునరుజ్జీవన చర్యలు ఇంటి వద్ద వెంటనే ప్రారంభించబడ్డాయి. రాత్రి 8:06 గంటలకు న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని మెడికల్ ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అతను కోలుకోలేదు .. రాత్రి 9:51 గంటలకు మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు …
“భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తోంది. నిరాడంబరమైన మూలాల నుండి ఎదిగి, గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగాడు. అతను ఆర్థిక మంత్రిగా సహా వివిధ ప్రభుత్వ పదవులలో పనిచేశాడు, సంవత్సరాలుగా మన ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు. పార్లమెంట్‌లో ఆయన చేసిన జోక్యాలు కూడా తెలివైనవి. మన ప్రధానమంత్రిగా, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఆయన విస్తృతంగా కృషి చేశారు, ”అని ప్రధాని ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన మన్మోహన్ 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా వ్యవహరించి యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలను నడిపించారు. 13వ భారత ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్… దేశంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరుపొందారు. దేశంలో అనేక ఆర్థిక సంస్థరణల రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1982-85 మధ్య కాలంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గా వ్యవహరించారు.
ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తి మన్మోహన్ సింగ్. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్… 1998-2004 మధ్య రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు.
1991-96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. అనేక సంస్కరణలతో (ఎల్.పి.జి) దేశ పురోగతికి బాటలు పరిచారు. 1993, 94లో ఉత్తమ ఆర్థికమంత్రిగా యూరోమనీ అవార్డు అందుకున్నారు. 2010లో ఆయనను వరల్డ్ స్టేట్స్ మన్ అవార్డు వరించింది. మన్మోహన్ యూజీసీ చైర్మన్ గానూ వ్యవహరించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యంత శక్తిమంతుల జాబితాలో మన్మోహన్ కు స్థానం లభించడం విశేషం. తన సుదీర్ఘమైన కెరీర్లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గానూ సేవలు అందించారు. ఆయనకు 1987లో పద్మవిభూషణ్ ప్రదానం చేశారు. 2017లో ఆయన ఇందిరాగాంధీ బహుమతి అందుకున్నారు.
మన్మోహన్ సింగ్ దేశ విభజనకు ముందు పాకిస్థాన్ లో 1932 సెప్టెంబరు 26న జన్మించారు. విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చేసింది. మన్మోహన్ సింగ్ కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు (ఉపీందర్, దమన్, అమృత్ సింగ్) ఉన్నారు.
దేశం దుఃఖిస్తోంది… మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ స్పందన
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
- భారతదేశ విశిష్ట నేతల్లో ఒకరంటూ మోదీ ట్వీట్
- దేశ ఆర్థికరంగంపై బలమైన ముద్ర వేశారని కితాబు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశిష్ట నేతల్లో ఒకరైన మన్మోహన్ కన్నుమూయడం పట్ల దేశం దుఃఖిస్తోంది అంటూ మోదీ ట్వీట్ చేశారు. నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారని మోదీ కొనియాడారు.
ఆర్థిక మంత్రి సహా, వివిధ హోదాల్లో పనిచేశారని, అనేక ఏళ్లుగా మన దేశ ఆర్థిక రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని కీర్తించారు. పార్లమెంటు సభ్యుడిగా, ఏదైనా అంశంలో జోక్యం చేసుకున్నారంటే అందులో ఎంతో వివేకంతో కూడిన ఆలోచన ఉండేదని మోదీ వివరించారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు మన ప్రధానిగా ఆయన విస్తృతమైన కృషి చేశారని కొనియాడారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తాను గుజరాత్ సీఎంగా ఉన్నానని, ఆ సమయంలో తనతో క్రమం తప్పకుండా మాట్లాడేవారని మోదీ గుర్తుచేసుకున్నారు. పాలనకు సంబంధించి అనేక అంశాలపై తాము మాట్లాడుకునేవారమని, ఆయన మాటలో విజ్ఞానం, నడవడికలో వినయం కనిపించేవని తెలిపారు.
ఈ విషాద సమయలో ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు, అసంఖ్యాక అభిమానులకు సంతాపం తెలియజేసుకుంటున్నానని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.