సుందరనగరంగా ఖమ్మం …2025 లో లక్ష్యాలు నిర్దేశించుకున్న …మంత్రి తుమ్మల
ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మం …500 ఎకరాల్లో వెలుగుమట్లలో ఏకో పార్క్
ఖమ్మంకు ఐకానిక్ గా మున్నేరు కేబుల్ బ్రిడ్జి
ఖిల్లా పై రోప్ వే ….220 కోట్లతో ఫ్లడ్ మల్లింపు కోసం డ్రైనేజీ
700 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా కాంక్రీట్ వాల్స్
లకారం ట్యాంక్ బండ్ వద్ద శిల్పారామం ఏర్పాటు ప్రతిపాదన
అధునాతన అంగులుతో మెడికల్ కాలేజీ

ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకొని అభివృద్ధి ప్రదాతగా పేరు తెచ్చుకున్న రాష్ట్ర వ్యవసాయ ,జౌళి ,పట్టు పరిశ్రమలు , సహకారశాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంనగర అభివృద్ధి ద్రుష్టి సారించారు …గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీచేసి 50 వేల ఓట్లతో ఘనవిజయం సంధించిన తుమ్మల ఖమ్మం నగరాన్ని సుందరనగరంగా తీర్చు సిద్ధేందుకు 2025 సంవత్సరంలో లక్ష్యాలను నిర్దేశించుకున్నారు…2024 ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియాతో ముచ్చట్ల కార్యక్రమంలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు … ఖమ్మం నగరం నిరంతరం రద్దీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ చేసి ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలని అందుకు అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసి ముందుకు వెళతామన్నారు…ఖమ్మం వరదలు వచ్చినప్పుడు మున్నేరు ప్రాంత మొత్తం నీట మునుగుతుందని గుర్తించి ఇరువైపులా 700 కోట్ల రూపాయల నిధులు హెచ్చించి కాంక్రీట్ వాల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు ..అంతే కాకుండా డ్రైనేజీ వాటర్ మళ్లించేందుకు మరో 220 కోట్లతో కాలువ నిర్మిస్తామని అన్నారు …ఖిల్లాపై రోప్ వే ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు …ఖమ్మంనగరానికే శోభా తెచ్చేవిధంగా ఉండే మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి ఉంటుందన్నారు ..లకారం ట్యాంక్ బండ్ పై శిల్పారామం మరో శోభ తెస్తుందని అన్నారు …ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ కొత్త భవనాల నిర్మాణం మోడల్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నట్లు చేప్పారు ..
రఘు నాథపాలెం దశాబ్దాల సాగు నీటి కలను సాకారం చేస్తూ సాగర్ కెనాల్ పై లిఫ్ట్ ఏర్పాటు చేయబోతున్నామని సంక్రాంతి రోజున మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కు శంకుస్థాపన జరుగుతుందన్నారు ….అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నా పదవి కాలంలోనే చేయాలనేది తన కోరికని పేర్కొన్నారు …ప్రకాశ్ నగర్ మున్నేరు హై లెవల్ బ్రిడ్జి మరమ్మత్తు పనులు రెండు నెలల్లో పూర్తి చేసి బ్రిడ్జి పై రాకపోకలు సాగిస్తామని తెలిపారు ..
హైదరాబాద్ ఓ.అర్.ఆర్ మాదిరి ఖమ్మం కు రింగ్ రోడ్ నిర్మాణం చేయాలనేది తన విజన్ అని ఖమ్మం నగరం చుట్టూ నేషనల్ హైవే లతో రింగ్ రోడ్ నిర్మాణం కు వెసులుబాటు కలిగిందని చిన్న చిన్న మార్పులతో దాన్ని పూర్తీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు…
చిరకాల కోరికగా ఉన్న గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయడం త్వరలోనే జరుగుతుందని అన్నారు …వచ్చే ఆగస్ట్ 15 నాటికి యాతాల కుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి,అశ్వారావు పేట కు సాగునీరు అందిస్తామని అన్నారు…. జూలూరుపాడు వద్ద టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి నీళ్ళు వస్తాయని అన్నారు…..సీతమ్మ సాగర్ పూర్తయితే పోలవరం టూ సీతమ్మ సాగర్ అక్కడ నుంచి సమ్మక్క సాగర్ అక్కడ నుంచి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజ్ వరకు నౌకాయానం ప్రతిపాదన ఉందని అన్నారు …
దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాద్రి కి రైల్వే లైన్ ఏర్పాటు తో భక్తులకు పర్యాటకులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని అన్నారు .. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ప్రజల డిమాండ్ గా ఉందని గతంలో సర్వేలు జరిపినప్పటికీ ఫీస్బుల్ కాకా ఆగిపోయిందని ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిందని తుమ్మల వివరించారు ….
కొత్తగూడెం లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం గట్టి ప్రయత్నం జరుగుతుందని కేంద్రం కూడా సుముఖంగా ఉందని తెలిపారు …కొత్తగూడెం లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు పై నిపుణులు నివేదిక తయారు చేస్తున్నారని తెలిపారు ..
…….భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆశీస్సులు తో ప్రజాదీవెనల తో నాకు సేవ చేసే భాగ్యం దక్కిందని అంటూ తెలంగాణ రైతాంగానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు…ప్రత్యేకించి ఖమ్మం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర ,సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు ….మీడియా ముచ్చట్ల కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , కార్పొరేటర్ కమర్తపు మురళి , సైదాబాబు లు పాల్గొన్నారు ..