
ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేల సంఖ్యలో ఉన్న పత్తి బస్తాలు కాలిపోతున్నాయి. మార్కెట్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది…ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు యత్నిస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మార్కెట్‌లో షార్ట్ సర్క్యూట్‌పై మంత్రి తుమ్మల ఆరా
– తక్షణమే అధికార యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం రాత్రి జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఖమ్మం మార్కెట్‌లో వ్యాపారులకు చెందిన పత్తి బస్తాలు షార్ట్ సర్క్యూట్‌తో ధగ్ధం కాగా… సంఘటన విషయం తెలిసిన మంత్రి తుమ్మల గారు అధికార యంత్రాంగాన్ని సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు.పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో మాట్లాడటంతో ఇతర అధికార యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేశారు. మార్కెటింగ్, ఫైర్, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్ళిన పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయంమై నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నికైన యరగర్ల హన్మంతరావు, వైస్‌చైర్మన్ తల్లాడ రమేష్‌లను సైతం మార్కెట్‌ను సందర్శించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
సంఘటనపై ఆరా తీయండి
మార్కెట్‌లో జరిగిన సంఘటన ఏ విధంగా జరిగింది.. ఏ సమయంలో జరిగింది.. ఇందుకు గల కారణాలను సైతం క్షుణ్ణంగా తెలుసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాఉ ఆదేశించారు. సెలవు రోజుల్లో ఈ సంఘటన జరగటంపై సుధీర్ఘంగా వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.