Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

హైద్రాబాద్ నగరానికి తిరుగుప్రయాణమైన ప్రజలు …టోల్ ప్లాజాల వద్ద వాహనాల బారులు!

  • సంక్రాంతికి పండుగకు వెళ్లి… హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
  • పంతంగి టోల్ ప్లాజాలోని 12 టోల్‌బూత్‌ల ద్వారా తెలంగాణ వైపు వాహనాలకు అనుమతి
  • ఏపీలోని ఆర్టీసీ బస్టాండ్లలో కూడా రద్దీ

సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగు ప్రయాణమయ్యారు. సంక్రాంతి కోసం ఇళ్లకు వెళ్లడంతో పండుగకు ముందు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రహదారి కిక్కిరిసిపోయింది. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో విజయవాడ – హైదరాబాద్ మార్గంలో వాహనాల రద్దీ పెరుగుతోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పంతంగి టోల్ ప్లాజాలోని 12 టోల్‌బూత్‌ల ద్వారా ఏపీ నుంచి తెలంగాణ వైపుకు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఏపీ నుంచి హైదరాబాద్ బయలుదేరడానికి రావడంతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు తదితర బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు అదనపు బస్సులను నడుపుతోంది.

Related posts

‘హైడ్రా’ మంచిదే.. రేవంత్‌పై వెంకయ్యనాయుడి ప్రశంసలు!

Ram Narayana

లడ్డు ప్రసాదం పై తమిళ యూట్యూబర్ హాస్యభరిత ,వ్యంగ్య ప్రసారం పై పొంగులేటి ఫైర్

Ram Narayana

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు… ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం: టీజీఆర్టీసీ

Ram Narayana

Leave a Comment