Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

శ్రీశైలం పూజారి ఇంట్లో చిరుత… !


శ్రీశైలం పుణ్యక్షేత్రం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం వన్యప్రాణులకు ఆవాసం. కాగా, శ్రీశైలం ఆలయ పూజారి సత్యనారాయణ ఇంట్లో చిరుతపులి ప్రవేశించింది. 

పూజారి సత్యనారాయణ ఇల్లు పాతాళగంగ మెట్ల మార్గంలో ఉంది. చుట్టూ అటవీప్రాంతం కావడంతో జంతువుల సంచారం ఎక్కువ. గత అర్ధరాత్రి ఓ చిరుత ప్రహరీగోడ దాటి ఆయన ఇంట్లోకి వచ్చింది. లోపలికి వచ్చిన చిరుత నిదానంగా కదులుతూ మరలా బయటికి వెళ్లిపోయింది. ఇంటి ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

Related posts

తెలంగాణలో జనసేనకు తక్కువ ఓట్లు వస్తే ఆ ప్రభావం ఏపీపై ఉంటుంది: రేవంత్ రెడ్డి

Ram Narayana

రేపు శ్రీశైలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన…

Ram Narayana

రేవంత్ రెడ్డితో సమావేశంపై పవన్ కల్యాణ్ స్పందన!

Ram Narayana

Leave a Comment