Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్షను భగ్నం చేసిన పోలీసులు!

  • బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు
  • పరీక్షలు మళ్లీ నిర్వహించాలంటూ ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్ష
  • తెల్లవారుజామున దీక్షను భగ్నం చేసిన పోలీసులు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటూ బీపీఎస్సీ అభ్యర్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి మద్దతుగా పాట్నాలోని గాంధీ మైదాన్ లో గత నాలుగు రోజులుగా ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చట్ట విరుద్ధంగా నిరసన చేపట్టినందువల్ల ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిరసన ప్రదేశంలో గుమికూడిన అభ్యర్థులను అక్కడి నుంచి పంపించేశామని చెప్పారు.

Related posts

మీడియా సమావేశంలో లాలూయాదవ్ సంచలన వ్యాఖ్యలు …

Drukpadam

గంగావతి నుంచి కేఆర్‌పీపీ అభ్యర్థిగా గాలి జనార్దన్‌రెడ్డి….

Drukpadam

గుజరాత్ లోని ఓ గేమింగ్ జోన్ లో ఘోర అగ్నిప్రమాదం… 35 మంది మృతి..

Ram Narayana

Leave a Comment