కేటీఆర్ నివాసంలో ఏసీబీ రెయిడ్స్…
ఫార్ములా – ఈ కార్ రేసు కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నెల 2న తేదీన ఇచ్చిన నోటీసుల మేరకు ఇవాళ కేటీఆర్ విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
అక్కడ తన న్యాయవాదితో కలిసి విచారణకు పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో తన వివరణతో కూడిన లేఖను అధికారులకు అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే తన ఇంట్లో ఏసీబీ రెయిడ్స్ జరుగుతాయని ఇవాళ ఉదయమే కేటీఆర్ మీడియాతో చెప్పారు. కేటీఆర్ చెప్పినట్లుగానే సాయంత్రానికి తనిఖీలు జరుగుతుండటం హాట్ టాపిక్ గా మారింది.