లండన్ పర్యటనకు వైయస్.జగన్
కుమార్తె పట్టా ప్రదానోత్సవానికి హాజరుకానున్న మాజీ సీఎం
వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు బయల్దేరివెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రదానోత్సవానికి వైయస్.జగన్ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత కింగ్స్ కాలేజీ లండన్‌లో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సును పూర్తిచేసి, చక్కటి ప్రతిభతో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు.
ఈనెల 16న కింగ్స్‌కాలేజ్, లండన్‌లో ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో వైయస్.జగన్ దంపతులు పాల్గోనున్నారు. ఈ నెలాఖరున జగన్ లండన్ నుంచి తిరిగి స్వదేశం రానున్నారు …